![Sanjay Dutt Got High On Drugs, Woke Up After Two Days - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/30/Untitled-9.gif.webp?itok=cJQ39CJl)
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను అభిమానులు ముద్దుగా సంజూ భాయ్ అని పిలుచుకుంటారు. కేజీఎఫ్ సినిమాలో అధీరాగా నటించి సౌత్ ఆడియన్స్‌కు దగ్గరైన అతడు గతంలో డ్రగ్స్‌కు బానిసైన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం అతడు దస్ కా దమ్ అనే షోలో బయటపెట్టాడు.
'ఓసారి డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఆదమరిచి నిద్రపోయాను. ఉదయం 7 గంటల సమయంలో నిద్ర లేచి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని ఇంటి సిబ్బందిని అడిగాను. దానికతడు ఏడుపందుకుంటూ.. రెండు రోజుల తర్వాత మీరు లేచి ఆకలి అని అడుగుతున్నారని చెప్పాడు. అదేంటి? నిన్న రాత్రే కదా పడుకున్నాను. రెండు రోజులంటున్నారేంటని ప్రశ్నించగా.. లేదు, మీరు బెడ్ మీద నుంచి లేవక రెండు రోజులయ్యిందన్నాడు. కొన్ని క్షణాలపాటు నాకేమీ అర్థం కాలేదు. వెంటనే డ్రగ్స్ మానేయాలని డిసైడ్ అయ్యాను. డ్రగ్స్ వేస్ట్.. జీవితాన్ని మత్తులో దింపే దానికి దగ్గరవకపోవడమే మంచిది' అని చెప్పుకొచ్చాడు సంజయ్ దత్.
చదవండి: రాజకీయ ఎంట్రీపై స్పందించిన నమిత
వంట చేసిన రామ్‌చరణ్, వీడియో చూశారా?
Comments
Please login to add a commentAdd a comment