
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేజీఎఫ్ సినిమాతో దక్షిణాది ప్రజలకూ చేరువయ్యాడు.ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు. 'ఒకరోజు నాకు విపరీతమైన వెన్నునొప్పి వచ్చింది. సరిగా ఊపిరి కూడా తీసుకోలేకపోయాను. ఆస్పత్రికి వెళ్తే క్యాన్సర్ ఉందన్న విషయం బయటపడింది. అప్పుడు నా భార్య, కుటుంబం ఎవరూ నా పక్కన లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. క్యాన్సర్ అని చెప్పగానే నా జీవితం అంతా గిర్రున తిరిగింది.
ఆ సమయంలో నా భార్య దుబాయ్‌లో ఉంది. నా పరిస్థితి తెలిసి నా సోదరి ప్రియా దత్ వెంటనే నా దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది. మా ఫ్యామిలీ క్యాన్సర్ బారిన పడటం కొత్తేమీ కాదు. మా అమ్మ, నా మొదటి భార్య రిచా శర్మ క్యాన్సర్‌తోనే చనిపోయారు. ప్రియ రాగానే ఒకటే చెప్పా.. చావాలని రాసిపెట్టుంటే అలాగే చచ్చిపోతాను కానీ కీమోథెరపీ మాత్రం వద్దు. నాకు ఎలాంటి చికిత్స తీసుకోవాలని లేదు అని కరాఖండిగా చెప్పాను' అని తెలిపాడు సంజయ్. ఇక క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలోనే సంజయ్ కేజీఎఫ్ 2 షూటింగ్‌లో పాల్గొనగా ఈ సినిమా అఖండ విజయం సాధించింది. 2020లోనే సంజయ్ క్యాన్సర్‌ను జయించాడు.
చదవండి: హీరో కార్తీకి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
చెత్త సినిమాలు చూడరు, అందుకే లీడ్ రోల్స్ చేయట్లేదు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment