Sanjay Dutt Joins Ram Pothineni Double Ismart Movie- Sakshi
Sakshi News home page

Sanjay Dutt: డబుల్‌ ఇస్మార్ట్‌: పవర్‌ఫుల్‌ రోల్‌లో సంజయ్‌దత్‌

Published Sun, Jul 30 2023 12:42 AM | Last Updated on Sun, Jul 30 2023 3:09 PM

Sanjay Dutt joins Ram Pothineni Double iSmart - Sakshi

రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో సంజయ్‌ దత్‌ కీలకపాత్ర చేయ నున్నారనే వార్త శుక్రవారం గుప్పు మన్న విషయం తెలిసిందే. ఆ వార్త నిజమే అని, బిగ్‌ బుల్‌గా సంజయ్‌ దత్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నారని ఈ చిత్ర యూనిట్‌ శనివారం ప్రకటించి, లుక్‌ని కూడా విడుదల చేసింది. ‘‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో సంజయ్‌ దత్‌ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.

‘‘మాస్‌కే డైరెక్టర్‌ అయిన పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్‌ రామ్‌తో కలిసి ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఆనందంగా, గర్వంగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 8  (‘డబుల్‌ ఇస్మార్ట్‌’ విడుదల) కోసం ఎదురు చూస్తున్నాను’’ అని సంజయ్‌ దత్‌ ట్వీట్‌ చేశారు. పూరి జగన్నా«థ్, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాలీ వుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ జియాని జియానెల్లి పని చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement