సూపర్‌ హిట్ సినిమాకు సీక్వెల్‌ షురూ | Yash And Prashnath Neel KGF2 Shooting Started | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్ సినిమాకు సీక్వెల్‌ షురూ

Published Wed, Mar 13 2019 10:17 AM | Last Updated on Wed, Mar 13 2019 10:26 AM

Yash And Prashnath Neel KGF2 Shooting Started - Sakshi

కన్నడ చిత్ర సీమలో సంచలన విజయం సాధించిన భారీ చిత్రం కేజీయఫ్‌. యువ కథానాయకుడు యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సాండల్‌వుడ్‌లోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ పనులు ప్రారంభించారు చిత్రయూనిట్‌. తొలి భాగం షూటింగ్ సమయంలోనే కేజీయఫ్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన చిత్రయూనిట్ తాజాగా రెండో భాగం షూటింగ్‌ ప్రారంభించారు.

విజయనగరలోని కోదండరామ ఆలయంలో పూజా కార్యక్రమాలతో కేజీయఫ్‌ సీక్వెల్‌ షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. తొలి భాగం 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌లు కేజీయఫ్‌ 2 నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/8

2
2/8

3
3/8

4
4/8

5
5/8

6
6/8

7
7/8

8
8/8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement