
కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమయ్యాయి. షూటింగ్‌లు లేక స్టార్లందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే చాలా మంది స్టార్లు సోషల్‌మీడియా ద్వారా తమ అభిమానులతో లాక్‌డౌన్‌లో తాము చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నాడు, అలాగే తన ఫ్యామిలికి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.( కొబ్బరిబొండాం చికెన్ రైస్ వండిన విష్ణు)
లాక్‌డౌన్ విధించడంతో తన భార్య పిల్లలు దుబాయ్‌లో చిక్కుకుపోయారని, తాను ఒక్కడినే ముంబైలోని తన ఇంట్లో ఉంటున్నానని సంజయ్‌దత్ చెప్పారు. భార్య, పిల్లలు దుబాయ్‌లో క్షేమంగా ఉన్నారని తెలిసిన జాగ్రత్తగా ఉన్నారో లేదో అని తెలియని భయం ఉంటుందన్నాడు. అయితే తన జీవితంలో ఇలాంటి లాక్‌డౌన్‌లాంటి పరిస్థితులను చాలానే చూశానని చెప్పారు. క్వారంటైన్ విశ్రాంతి తీసుకుంటూ తన తరువాత ప్రాజెక్ట్‌లపై దృష్టి కేంద్రీకరించానని తెలిపారు. తన ఎక్కువ సమయాన్నిరాబోయే చిత్రం బిజులోని డైలాగ్స్‌ని ప్రాక్టీస్ చేయడంపై పెట్టానని చెప్పారు. ఇక సంజయ్‌దత్ సినిమాల విషయానికి వస్తే నర్గీస్‌ఫక్రీ, రాహుల్‌దేవ్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్న టోర్‌బాజ్ సినియా 2020 చివరిలో విడుదల కానుంది. ఇక ఎంతో మంది ఎదురుచూస్తున్న యశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న కేజీఎఫ్-2లో సంజయ్‌దత్ నటించనున్నారు. ఈ సినిమాతో సంజయ్ కన్నడ సినీ పరిశ్రమలో అడుగుపెట్టనున్నారు. (నో నాన్ వెజ్)