
దక్షిణాది సినిమా స్టామినా ఏంటో బాహుబలి సినిమాలు నిరూపించాయి. అటుపై ఆ రేంజ్‌లో పాపులర్ అయిన చిత్రం కేజీఎఫ్. బాహుబలి తర్వాత ఓ సౌత్ సినిమా బాలీవుడ్‌ను గడగడలాడించిన చిత్రం కేజీఎఫ్. రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్లు కొల్లగొట్టి కన్నడ చరిత్రలో నిలిచిపోయింది. ఇక మొదటి పార్ట్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి.. రెండో పార్ట్‌ను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండో పార్ట్‌లో బాలీవుడ్ స్టార్స్ వచ్చి చేరడంతో ఇంకా హైప్ పెరిగింది.
సంజయ్‌దత్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన అధీరా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం బెంగళూరు కోలార్ మైన్స్ లో వేసిన భారీ సెట్స్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని మేకర్స్ తెలిపారు. అలాగే 23 ఆగస్టు నుంచి హైదరాబాద్ పరిసరాల్లో షెడ్యూల్ కొనసాగుతుందని, నెలాఖరుకు అది పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత కర్నాటక- భళ్లారి మైన్స్‌లో సంజయ్ దత్ అధీరా పాత్రపై చిత్రీకరణ సాగనుందని తెలిపారు. ఈ షెడ్యూల్‌తో మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుందని.. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.