బంగారు గనుల్లోకి... | Sanjay Dutt Adheera in Yashs KGF: Chapter 2 | Sakshi
Sakshi News home page

బంగారు గనుల్లోకి...

Published Tue, Jul 30 2019 2:59 AM | Last Updated on Tue, Jul 30 2019 2:59 AM

Sanjay Dutt Adheera in Yashs KGF: Chapter 2 - Sakshi

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో అధికారం కోసం పోరాటం జరుగుతోంది. రాకీ భాయ్‌ (యశ్‌) ఎదుర్కోవాల్సిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ ఖల్‌నాయక్‌ సంజయ్‌ దత్‌ కూడా ఈ బంగారు గనుల్లోకి అడుగుపెట్టనున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా హొంబలే ఫిల్మ్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్‌’. చాప్టర్‌ 1 గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. 250 కోట్ల వసూళ్లను కూడా సాధించింది. ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’లో అధీరా పాత్రలో సంజయ్‌ దత్‌ నటించనున్నారు. ఆయన లుక్‌ను సోమవారం రిలీజ్‌ చేశారు. ‘‘బెంగళూరులో కోలార్‌ మైన్స్‌లో మూడో షెడ్యూల్‌ జరుగుతోంది. ఆగస్ట్‌లో హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ ఉంది. ఆ తర్వాత సంజయ్‌ ద™Œ  షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement