Maanayata
-
కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే?
సంజయ్‌దత్ (Sanjay Dutt) జీవితంలో ఆకాశమంత విజయాల్ని చూశాడు. జైలు జీవితం, డ్రగ్స్‌కు బానిసవడంతో తన పతనాన్నీ చూశాడు. క్యాన్సర్‌తో పోరాడి వారియర్‌గా గెలిచాడు. వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. మొదటి భార్య రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించగా రెండో భార్య రియా పిల్లైతో ఎంతోకాలం కలిసుండలేకపోయాడు. ప్రస్తుతం మూడో భార్య మాన్యతతో కలిసి జీవిస్తున్నాడు.గర్భంతో భార్య.. జైలుకు సంజయ్అయితే మాన్యత (Maanayata) గర్భం దాల్చినప్పుడు సంజయ్ చిక్కుల్లో పడ్డాడు. 1993 ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుల నుంచి అక్రమంగా ఆయుధాలను తీసుకున్న కేసులో సంజయ్ దత్ దోషిగా తేలాడు. దీంతో ఐదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించి 2016లో రిలీజయ్యాడు. అయితే సంజయ్ జైల్లో ఉన్నప్పుడు మాన్యత ప్రెగ్నెంట్. అలాంటి సమయంలో ఆమెను ఒంటరిగా వదిలేయాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని తన బెస్ట్ ఫ్రెండ్, నటి షీబా ఆకాశ్‌దీప్ (Sheeba Akashdeep)ను ఆదేశించాడు. సంజయ్ దత్-మాన్యత, షీబా ఆకాశ్దీప్ఫ్రెండ్ సాయం కోరిన నటుడుఈ విషయాన్ని షీబా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. జైలుకు వెళ్లేముందు సంజు నాతో మాట్లాడాడు. మాన్యత ఒంటరిగా ఉంది. తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే! అని నాపై భారం వేశాడు. సంతోషంగా అంగీకరించాను. ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్లేదాన్ని. తనతో కూర్చుని మాట్లాడేదాన్ని. ఒంటరితనం ఫీలవకూడదని నావంతు ప్రయత్నించాను. సంజూ బయటకు వచ్చేంతవరకు నేను తనతోనే ఉన్నాను. తొమ్మిది నెలలపాటు మాన్యతకే సమయం కేటాయించాను అని చెప్పుకొచ్చింది. తప్పదని తెలిశాక..2010 అక్టోబర్‌లో మాన్యత కవలపిల్లలకు జన్మనిచ్చింది. జైలు జీవితం గురించి సంజయ్‌దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను మొదటిసారి థానే జైలుకు వెళ్లినప్పుడు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్.. ఇలా అందరూ వచ్చారు. జైలు బయట వీరు నాతో మాట్లాడిన ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. జైలు జీవితం నుంచి తప్పించుకోలేను అని తెలిసినప్పుడు దాని గురించి అతిగా ఆలోచించడం దేనికనుకున్నాను. ఎంతో నేర్చుకున్నా..అన్నింటికీ సిద్ధంగా ఉండాలనుకున్నాను. ఏం జరిగినా స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. ఐదేళ్ల జైలు జీవితంలో ఎంతో నేర్చుకున్నాను. ఆ సమయంలో వంట చేయడం కూడా నేర్చుకున్నాను. వర్కవుట్స్ కూడా చేసేవాడిని అని పేర్కొన్నాడు. సంజయ్ జీవిత కథ ఆధారంగా సంజు అనే సినిమా తెరకెక్కింది. బాలీవుడ్లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం విలన్‌గా అలరిస్తున్నాడు. కేజీఎఫ్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.చదవండి: ప్రేమించిన వ్యక్తి కోసం సారిక చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: నటుడు -
ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడతాం: మాన్యత
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఆరోగ్యంపై ఆయన భార్య మాన్యత దత్ ఒక ప్రకటన చేశారు. తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ఆ ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 'ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాలి. గతంలో కూడా ఎన్నో ఆపదల నుంచి మా కుటుంబం బయపడింది. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తాం. సంజయ్‌అభిమానులందరికి నా విజ్ఞప్తి ఒక్కడే. దయచేసి పుకార్లను నమ్మకండి, వాటిని ప్రచారం చేయకండి. సంజయ్ ఆరోగ్యానికి సంబంధించి క్రమం తప్పకుండా మీకు అప్డేట్ అందిస్తాం. నా పిల్లలకు మాత్రమే కాదు ..తల్లిదండ్రులు చనిపోయాక సంజయ్ కుటుంబం మొత్తానికి తండ్రిలా ఉన్నాడు. తనకి క్యాన్సర్ అని తెలియగానే మొత్తం కుటుంబం కదిలిపోయింది. అయితే మేం అందరం కలిసి పోరాడాలని నిశ్చయించుకున్నాం. ఈ క్లిష్ట సమయాన్ని సానుకూల దృక్పదంతో ఎదుర్కోవాలనుకుంటున్నాం. ఈ సుదీర్ఘ పోరాటంలో అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కావాలి. మీ ప్రార్థనలు, దేవుని ఆశిస్సులతో ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడతాం' అని మాన్యత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (సంజయ్ ఎప్పుడూ పోరాట యోధుడే: మాన్యత దత్) అయితే తన ఆరోగ్య చికిత్స నిమిత్తం షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు అభిమానులకు తెలియజేస్తూ సంజయ్ దత్ ఓ పోస్టును విడుదల చేశారు. దీంతో సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో భాదపడతున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. సంజయ్ త్వరగా కోలుకొని మరోసారి తెరమీద కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్ గతేడాది.. కళంక్, ప్రస్తానం, పానిపట్ చిత్రాలతో అలరించారు. తాజాగా 1991లో మహేశ్ బట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ సడక్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సడక్ 2లో నటిస్తున్నారు. ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో.. పూజాభట్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ భట్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన సోదరుడు ముఖేశ్ భట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (క్యాన్సర్ శాపం) 🙏🏻 pic.twitter.com/tinDb6BxcL — Sanjay Dutt (@duttsanjay) August 11, 2020 -
సంజయ్ దత్ ఆరోగ్యంపై స్పందించిన మాన్యత
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజూ ఆరోగ్యంపై ఆయన భార్య మాన్యత దత్ స్పందించారు. సంజయ్ ఎప్పుడూ పోరాట యోధుడేనని, ఈ సారి కూడా విజయం ఆయనదే అవుతుందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కావాలని ఓ ప్రకటనలో తెలిపారు. (చదవండి : ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్) ‘సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ విషెస్ తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాలి. గతంలో కూడా ఎన్నో ఆపదన నుంచి మా కుటుంబం బయపడింది. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తాం. సంజయ్‌దత్ అభిమానులందరికి నా విజ్ఞప్తి ఒక్కడే.. దయచేసి పుకార్లను నమ్మకండి, వాటిని ప్రచారం చేయకండి. మీ తోడు మాకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’అని మాన్యత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ నోట్లోనూ సంజయ్ దత్ నిజంగానే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాడా.. లేదా? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. (చదవండి : ఆ పుకార్లు నమ్మకండి: సంజయ్‌దత్) కాగా, ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి కారణంగా సంజయ్ దత్ మంగళవారం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఊపిరితిత్తుల కాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్ గతేడాది.. కళంక్, ప్రస్తానం, పానిపట్ చిత్రాలతో అలరించారు. తాజాగా 1991లో మహేశ్ బట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ సడక్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సడక్ 2లో నటిస్తున్నారు. ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో.. పూజాభట్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ భట్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన సోదరుడు ముఖేశ్ భట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
సంజయ్ బయోపిక్ లో మాన్యత ఎవరు?
ముంబై: దర్శక రచయిత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ బయోపిక్ స్టార్ కాస్ట్ పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా మున్నాభాయ్ సతీమణి మాన్యత ప్రాతను ఎవరు పోషించనున్నారనే దానిపై అంచనాలు బీ టౌన్ లో హల్ చల్ చేస్తున్నాయి. నటి నేహా బాజ్ పేయిని(41) మాన్యత పాత్రకు ఎంపిక చేశారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బాలీవుడ్ హీరో బాబీ డియోల్ సరసన 1988లో కరీబ్ సిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నేహ ఆ తర్వాత నటుడు మనోజ్ వివాహం చేసుకుంది. బాలీవుడ్ యంగ్ హీరో రణభీర్ కపూర్ ఈ సూపర్ స్టార్ పాత్రను పోషిస్తుండగా, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా అనుష్క శర్మ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. అలాగే రాజకుమార్ హీరానీ ..ఫస్ట్ షాట్ అంటూ ఇటీవల ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేసి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాడు. కాగా మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్, లగే రహే మున్నాభాయ్, పీకే చిత్రాలలో సంజూ బాబాతో కలిసి పనిచేసిన రాజ్ కుమార్ హిరానీ కి ఏర్పడిన బలమైన స్నేహ బంధంతో సంజయ్ దత్ బయోపిక్ కి సిద్ధమవుతున్నాడు. మరోవైపు పవర్ పాక్డ్ స్టార్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ మరో బ్లాక్ బ్లస్టర్ మూవీకానుందా.. వేచి చూడాలి.