సంజయ్ బయోపిక్ లో మాన్యత ఎవరు? | THIS actress is playing Maanayata in Sanjay Dutt biopic! | Sakshi
Sakshi News home page

సంజయ్ బయోపిక్ లో మాన్యత ఎవరు?

Published Sat, Jan 21 2017 2:12 PM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

సంజయ్ బయోపిక్ లో మాన్యత ఎవరు? - Sakshi

సంజయ్ బయోపిక్ లో మాన్యత ఎవరు?

ముంబై: దర్శక రచయిత రాజ్ కుమార్ హిరానీ  దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ బయోపిక్  స్టార్ కాస్ట్ పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా మున్నాభాయ్  సతీమణి  మాన్యత ప్రాతను ఎవరు పోషించనున్నారనే  దానిపై అంచనాలు బీ టౌన్ లో హల్ చల్ చేస్తున్నాయి. నటి నేహా బాజ్ పేయిని(41)  మాన్యత పాత్రకు ఎంపిక  చేశారనే ఊహాగానాలు  ఊపందుకున్నాయి.  

బాలీవుడ్ హీరో బాబీ డియోల్ సరసన  1988లో కరీబ్ సిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన  నేహ  ఆ తర్వాత నటుడు మనోజ్  వివాహం చేసుకుంది.  బాలీవుడ్  యంగ్ హీరో రణభీర్ కపూర్ ఈ  సూపర్ స్టార్ పాత్రను పోషిస్తుండగా, సోనమ్ కపూర్  ప్రధాన పాత్రలో నటిస్తుండగా అనుష్క శర్మ   కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట.   అలాగే రాజకుమార్  హీరానీ ..ఫస్ట్ షాట్ అంటూ ఇటీవల ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేసి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాడు.

కాగా మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్, లగే రహే మున్నాభాయ్, పీకే చిత్రాలలో సంజూ బాబాతో కలిసి పనిచేసిన రాజ్ కుమార్ హిరానీ కి   ఏర్పడిన బలమైన స్నేహ బంధంతో  సంజయ్ దత్ బయోపిక్  కి సిద్ధమవుతున్నాడు. మరోవైపు పవర్ పాక్డ్ స్టార్స్ తో  ప్రేక్షకుల ముందుకు రానున్న  ఈ మూవీ మరో బ్లాక్ బ్లస్టర్ మూవీకానుందా.. వేచి  చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement