ముంబై: బాలీవుడ్‌లో ఎఫైర్స్, తగాదాలు, న్యాయపోరాటాలు కామన్గా మారిపోయాయి. సీనియర్ నటుడు రిషీ కపూర్ తన ఆత్మకథ ఖుల్లాం ఖుల్లాలో ఇలాంటి విషయాన్నే వెల్లడించాడు. హీరో సంజయ్ దత్ ఓ హీరోయిన్ విషయంలో తనతో గొడవపడి కొట్టాలని భావించాడని రిషీ కపూర్ వెల్లడించాడు. తనను అపార్థం చేసుకోవడమే దీనికి కారణమని, తర్వాత సంజయ్ విషయం తెలుసుకుని తనతో సఖ్యతగా మెలిగాడని పేర్కొన్నాడు.
నటుడు గుల్షన్ గ్రోవర్ చెప్పిన విషయాన్ని రిషీ కపూర్ తన ఆత్మకథలో ప్రస్తావించాడు. 'సంజయ్ దత్‌కు అప్పట్లో నటి టీనా మున్నిమ్తో ఎఫైర్ ఉండేది. టీనాతో రిషీ కపూర్కు కూడా ఎఫైర్ ఉందని సంజయ్ అనుమానించాడు. సంజయ్ స్నేహితులు రిషీ కపూర్ గురించి చెడుగా చెప్పడమే దీనికి కారణం. సంజు, నేను అన్నదమ్ముళ్లలాగా ఉండేవాళ్లం. ఓ రోజు సంజయ్ నా వద్దకు వచ్చి రిషీ కపూర్ ఇంటికి వెల్లి గొడవ పెట్టుకోవాలని చెప్పాడు. రిషీ కపూర్ భార్య నీతూజీ ఈ విషయంలో ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ జరగకుండా చూసింది. టీనాతో రిషీ కపూర్కు ఎఫైర్ లేదని సంజయ్కు వివరించింది చెప్పింది. దీంతో అక్కడ నుంచి మేం వచ్చేశాం' అని గుల్షన్ గ్రోవర్ చెప్పినట్టుగా రిషీ కపూర్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు.
ఆ హీరోయిన్ కోసం నన్ను కొట్టాలనుకున్నాడు
Published Fri, Feb 3 2017 5:13 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
Advertisement
Advertisement