స్మృతి ఇరానీ మాట్లాడకపోతేనే..: రిషి కపూర్
పార్లమెంటులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉద్వేగభరిత ప్రసంగం వీడియో ఆన్లైన్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల మాట అటుంచితే పలువురు నెటిజన్లు ఆమె వాగ్ధాటికి ముగ్ధులయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ కూడా స్మృతి ఇరానీ ప్రసంగాన్ని తెగ పొగుడుతున్నారు. సింగిల్ హ్యాండ్ తో ప్రతిపక్షాలను తిప్పికొట్టిందని, లేడీ అమితాబ్ అని, ప్రతిపక్షాలు నోరు మెదిపేందుకు తడబడే స్థితిని కల్పించిందని ఇది వరకే రిషి కపూర్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
అయితే తాజాగా శనివారం స్మృతి ఇరానీని మరోసారి గుర్తుచేసుకున్నారు ఈ సీనియర్ యాక్టర్. జైపూర్లో ఉన్న రిషి కపూర్ సాయంత్రం ఇండియా-పాకిస్థాన్ టి-20 మ్యాచ్ చూడాల్సి ఉందని.. కానీ అది స్మృతి మరోసారి దాడి చేసేందుకు నిర్ణయించుకోకపోతేనే.. అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి స్మృతి ఇరానీకి రాజకీయాల్లో కూడా గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది.
Shall watch Ind-Pak T-20 at Samode,Jaipur this evening ,unless ofcourse Smriti Irani decides to attack again! Lol pic.twitter.com/Zkw5jtf0XI
— Rishi Kapoor (@chintskap) February 27, 2016