
'ఇప్పుడు ఏదో ఒకటి చేసి చూపించండి'
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.
ముంబై: బాలీవుడ్ నటుడు రిషి కపూర్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రసంగించడం చాలా గర్వ కారణమంటూ సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశారు. ఢిల్లీ, బిహార్ ఎన్నికలతో సంబంధం లేకుండా 'యూ ఆర్ ది బెస్ట్' అని మోదీనుద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఇప్పుడు ఏదో ఒకటి చేసి చూపించండి' అంటూ ట్విట్ చేశారు.
కాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లండన్ చేరిన మోదీ శుక్రవారం అక్కడి వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఇక మోదీ గౌరవార్థం బకింగ్ హ్యామ్ ప్యాలెస్లో క్వీన్ ఎలిజబెత్ విందు ఇచ్చారు. అనంతరం వెంబ్లే స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
Way to go PM Modi. Proud of you speaking at the UK Parliament. You are the best,sir, irrespective Delhi, Bihar. Bas ab Kuch kar dikhao!