‘ఈ దుర్వార్త బాధిస్తోంది! నమ్మలేకపోతున్నా’ | Unreal And Unbelievable, Kohli Mourns Rishi Kapoor | Sakshi
Sakshi News home page

నిజంగా నమ్మలేకపోతున్నా: కోహ్లి

Published Thu, Apr 30 2020 3:55 PM | Last Updated on Thu, Apr 30 2020 4:35 PM

Unreal And Unbelievable, Kohli Mourns Rishi Kapoor - Sakshi

ముంబై:  ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషీకపూర్‌(67) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. రిషీకపూర్‌ మరణంతో బాలీవుడ్‌ మూగబోయింది.  రిషీకపూర్ మరణంపై పలువురు భారత క్రికెటర్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘ ఇది చాలా బాధాకరం.  రిషీ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేకుండా ఉంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన్ను ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.  రిషీ కపూర్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సచిన్‌ సంతాపం వ్యక్తం చేశాడు. (ప్రముఖ నటుడు రిషీకపూర్‌ కన్నుమూత)

‘రిషీకపూర్ మరణవార్త నా గుండెని కలచివేస్తోంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సెహ్వాగ్‌ సంతాపం తెలిపాడు.  ‘ఇది నమ్మలేని నిజం. నిన్న ఇర్ఫాన్ ఖాన్, ఈరోజు రిషీకపూర్.  దిగ్గజ నటుడు చనిపోయారనే దుర్వార్తను అంగీకరించడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా  సానుభూతి’ అని విరాట్‌ కోహ్లి సంతాపం తెలిపాడు. ‘ రిషీ కపూర్‌ ఆకస్మిక మరణం విని షాక్‌కు గురయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు ఇదే నా సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని శిఖర్‌ ధావన్‌ ట్వీట్‌ చేశాడు. ‘ రిషీ కపూర్‌ మరణం దుఖః సాగరంలో ముంచింది. ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతిని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మరొక దిగ్గజ నటుడు దూరమయ్యారు. నిజంగా వరుసగా వచ్చిన ఈ రెండు రోజులూ దుర్దినాలే’ అని సంతాపం వ్యక్తం చేశారు. (రిషి క‌పూర్ లాస్ట్ ట్వీట్ అదే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement