ఎఫైర్‌ విషయంలో సీనియర్‌ నటుడిపై దాడి! | Sanjay Dutt wanted to beat up over an affair | Sakshi
Sakshi News home page

ఎఫైర్‌ విషయంలో సీనియర్‌ నటుడిపై దాడి!

Published Sun, Feb 5 2017 12:45 PM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM

ఎఫైర్‌ విషయంలో సీనియర్‌ నటుడిపై దాడి! - Sakshi

ఎఫైర్‌ విషయంలో సీనియర్‌ నటుడిపై దాడి!

బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌ జీవితకథ త్వరలోనే సినిమాగా వస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌ కుమార్‌ హీరానీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సంజూ భాయ్‌గా రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్నాడు. అయితే, రణ్‌బీర్‌ సింగ్‌ తండ్రి రిషీ కపూర్‌, సంజయ్‌దత్‌ గతంలో ఓ ఎఫైర్‌ విషయంలో గొడవపడ్డారట. ఆ విషయం తాజాగా రిషీ కపూర్‌ రాసిన ఆత్మకథ 'ఖుల్లాంఖుల్లా: రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్‌'లో వెలుగుచూసింది.

ఈ గొడవ గురించి బాలీవుడ్‌ నటుడు గుల్షన్‌ గ్రోవర్‌ ముంబై మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'ఆ సమయంలో సంజయ్‌కి టీనా మునిమ్‌ (అంబానీ)తో ఎఫైర్‌ ఉండేది. అప్పటికీ బ్యాచ్‌లర్‌గా ఉన్న చింటూ (రిషీ కపూర్‌) కూడా ఆమెతో సన్నిహితంగా ఉండేవారు. సంజయ్‌, నేను అన్నాదమ్ముల్లా ఉండేవాళ్లం. ఒక రోజు అతను నా దగ్గరికి వచ్చి 'మనమిద్దరం చింటూ ఇంటికి వెళ్లి.. అతన్ని చితక్కొట్టాలి' అని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఆయన ఇంటికి వెళ్లాం. అక్కడ చింటూ ఫియాన్సీ నీతూజీ మమ్మల్ని అడ్డుకున్నారు. చింటూకి టీనాతో ఎఫైర్‌ లేదని మాకు నచ్చజెప్పడంతో మేం వెనుకకు వచ్చేశాం' అని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు రిషీపై దాడి చేసేందుకు సిద్ధమైన సంజూ భాయ్‌ నిజజీవిత పాత్రలోనే ఇప్పుడు ఆయన కొడుకు రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తుండటం విచిత్రంగా ఉందని ఆయన ఛలోక్తిగా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement