వల్గర్ ఫోటో.. నటుడిపై ఫిర్యాదు
వల్గర్ ఫోటో.. నటుడిపై ఫిర్యాదు
Published Sun, Aug 27 2017 1:19 PM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM
ముంబై: బాలీవుడ్ వెటరన్ నటుడు రిషికపూర్ పై మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ట్విట్టర్ పేజీలో ఈ సీనియర్ నటుడు ఓ అశ్లీల ఫోటోను పోస్ట్ చేశారంటూ ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
రిషి కపూర్ తాజాగా తన ట్విట్టర్ పేజీలో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. నగ్నంగా ఉన్న ఓ చిన్నారి ఫోటోతో ఓ సందేశాన్ని ఉంచారు. కానీ, తీవ్ర విమర్శలు రావటంతో ఆ మరుసటి రోజే దానిని తొలగించారు కూడా. అయితే అది ఫోర్నోగ్రఫీతో కూడిన పోస్ట్ అని పేర్కొంటూ జయ హో అనే స్వచ్ఛంద సంస్థ బాంద్రా కుర్ల సైబర్ సెల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ‘ఆయన రిషి ఖాతాలో 2.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. వారందరికీ పోర్నోగ్రఫీతో కూడిన ఆ పోస్ట్ చేరి ఉంటుంది. అశ్లీలతను ఉసిగొల్పినందుకే ఆయనపై ఫిర్యాదు చేశాం’ అని జయ హో సంస్థ ప్రతినిధి అప్రోజ్ మాలిక్ తెలిపారు. అయితే ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనన్న అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు.
64 ఏళ్ల దిగ్గజ నటుడికి ఇలాంటివి కొత్తేం కాదు. గతంలో సోషల్ మీడియా వేదికగానే పలు అంశాలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కూడా. ఇక సినిమాల పరంగా చూసుకుంటే రిషి కపూర్ నటించిన పటేల్‌కి పంజాబ్ షాదీ రిలీజ్‌కు రెడీ కాగా, అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్న ‘102 నాట్ అవుట్’ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
Advertisement
Advertisement