![Amitabh Bachchan Explains Why He Never Visited Rishi Kapoor In Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/1/amithabh_rishikapoor.jpg.webp?itok=je4Iysp3)
‘ఎప్పుడు చిరునవ్వుతో ఉండే రిషి కపూర్ ముఖంపై నేను బాధను చూడాలని అనుకోలేదు. అందుకే రిషి కపూర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనను చూడడానికి వెళ్లలేదు’ అని అమితాబ్ బచ్చన్ వెల్లడించాడు. అతని చివరి క్షణాలలో కూడా ముఖంపై చిరునవ్వుతోనే వెళ్లి ఉంటాడని భావిస్తున్నాను అని ఆయన అన్నారు. ఇక బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్(67) గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడిన ఆయన ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. చాకొలెట్‌బాయ్ రిషి కపూర్ మరణించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరు రిషితో తమకు ఉన్నఅనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో రిషి కపూర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కూతురు రిధియా తండ్రిని చివరిచూపు చూడకుండానే ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. (మే 17 వరకు లాక్‌డౌన్ పొడగింపు)
ఈ క్రమంలో శుక్రవారం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రిషి కపూర్ మరణంపై సంతాపం ప్రకటించారు. ఈ మేరకు బిగ్ బీ తన బ్లాగ్‌లో రిషి కపూర్ గురించి రాసుకొచ్చారు. మిస్టర్ కపూర్‌తో తన తొలి సమావేశాల గురించి, ఆర్కె స్టూడియోలో గడిపిన సందర్భాల గురించి తెలిపారు. రిషి కపూర్ నడక, డైలాగ్ డెలివరీ, లిప్-సింకింగ్, అద్బుత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. రిషి కపూర్ , అమితాబ్ ఇద్దరూ కభీ-కభీ, అమర్, అక్బర్, ఆంథోనీ, నసీబ్, కూలీ, 102 నాట్ ఔట్.. ఇలా 77 సినిమాల్లో కలిసి నటించారు. అయితే రిషి కపూర్ మరణంతో అమితాబ్ చలించిపోయారు. అందుకే రిషి కపూర్ అంత్యక్రియలకు కూడా ఆయన హాజరు కాలేదు. తన కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్ వెళ్లారు. (‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’ )
Comments
Please login to add a commentAdd a comment