అనుష్క శర్మ తప్పేంటి..? | Rishi Kapoor supports Anushka Sharma! | Sakshi
Sakshi News home page

అనుష్క శర్మ తప్పేంటి..?

Mar 27 2015 10:23 PM | Updated on Apr 3 2019 6:23 PM

అనుష్క శర్మ తప్పేంటి..? - Sakshi

అనుష్క శర్మ తప్పేంటి..?

వదలద్దు.. వీలైనన్ని తిట్లు తిట్టండి.. ఇంకోసారి ఆట మైదానానికి వెళితే అక్కడిక్కడే ఆడిపోసుకోండి...

 వదలద్దు.. వీలైనన్ని తిట్లు తిట్టండి.. ఇంకోసారి ఆట మైదానానికి వెళితే అక్కడిక్కడే ఆడిపోసుకోండి... అంటూ అనుష్క శర్మపై కొంతమంది కారాలూ మిరియాలూ నూరుతున్నారు. హిందీ రంగానికి చెందిన కమాల్ ఆర్. ఆన్ అనే నటుడైతే ఏకంగా అనుష్క శర్మ ఇంటిపై రాళ్లు విసరమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. గురువారం జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు చిత్తుగా ఓడిపోయిన సందర్భంగా అనుష్క శర్మను కొంతమంది ఈ విధంగా నిందిస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ విరాట్ కోహ్లీ ఆట చూడాలని ఆమె సిడ్నీ వెళ్లారు. కట్ చేస్తే.. ఒకే ఒక్క పరుగు తీసి విరాట్ అవుట్ కావడం, భారత జట్టు ఓడిపోవడం.. ఇవన్నీ అనుష్క వల్లే అని కొంతమంది నిందిస్తున్నారు.
 
  అయితే చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంలో అనుష్కను సపోర్ట్ చేస్తున్నారు. ఇలా అనవసరంగా నిందలేస్తున్న నిరక్షరకుక్షుల్ని పట్టించుకోనవసరం లేదని సీనియర్ నటుడు రిషీ కపూర్ ఆమెకు అండగా నిలిచారు. బాయ్‌ఫ్రెండ్‌ను ప్రోత్సహించడానికి అక్కడకు వెళ్లడమే అనుష్క చేసిన తప్పా? అని ప్రియాంకా చోప్రా ప్రశ్నించారు. దేశం మొత్తం భారత జట్టును ప్రోత్సహించవచ్చు కానీ, ఓ ఆటగాడి గాళ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయకూడదా అని బిపాసా బసు స్పందించారు. అనుష్క శర్మను నిందించడం విడ్డూరంగా ఉందని అభిషేక్ బచ్చన్, మధుర్ భండార్కర్‌లు వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement