ఆమెతో కోహ్లి విహరిస్తుండగా..! | Virat Kohli, Anushka Sharma enjoying in Prague | Sakshi
Sakshi News home page

ఆమెతో కోహ్లి విహరిస్తుండగా..!

Published Sat, Sep 3 2016 12:52 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆమెతో కోహ్లి విహరిస్తుండగా..! - Sakshi

ఆమెతో కోహ్లి విహరిస్తుండగా..!

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అభిమానికి చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లో ఓ అందమైన అనుభవం ఎదురైంది. ప్రేగ్‌లో సంచరిస్తుండగా అతనికి కోహ్లి కనిపించాడు. ఒంటరిగా కాదు ప్రియురాలు అనుష్క శర్మతో.. ప్రేగ్‌లో కలిసి విహరిస్తున్న వారిద్దరు ఎదురుపడటంతో ఆ అభిమాని ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కోహ్లితో ఫొటో దిగాలని ముచ్చటపడ్డాడు. దీంతో అతను కోహ్లితో కలిసి ఫోజు ఇవ్వగా.. ఏకంగా అనుష్కనే కెమెరాను క్లిక్‌ మనిపించారు.

ఆ ఫొటోను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ’కొత్త మాస్టర్‌ బ్లాస్టర్‌తో నేను ఫొటో దిగాను. ఇంతమంచి ఫొటో తీసినందుకు అనుష్క శర్మకు కృతజ్ఞతలు’ అని పేర్కొంటూ అతను పెట్టిన పోస్టు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఇంతియాజ్‌ ఆలీ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు అనుష్క ప్రస్తుతం ప్రేగ్‌లో ఉన్నారు. ఆమెను కలిసేందుకు కోహ్లి నేరుగా ప్రేగ్‌కు వెళ్లాడు. అక్కడ విహరిస్తుండగా ఓ అభిమాని ఇలా ఫొటో దిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement