
ముంబై : తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముంబై చందన్‌వాడి శ్మశాన వాటికలో ముగిశాయి. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే అంత్యక్రియలు ముగించాలని పోలీసులు సూచించడంతో ఢిల్లీ నుంచి బయలుదేరిన రిషీ కుమార్తె రిధిమా కపూర్ రాకముందే అంత్యక్రియలు ముగిశాయి. నిబంధనల ప్రకారం కేవలం 20 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రిషీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుమారుడు రణబీర్‌కపూర్, భార్య నీతూకపూర్, సోదరి రీమా జైన్, మనోజ్ జైన్, ఆర్మాన్, నటులు సైఫ్ అలీఖాన్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, అలియాభట్, అనిల్ అంబానీ, ఆయాన్ ముఖర్జీ వంటి కొద్దిమందిని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతించారు. ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో గురువారం ఉదయం రిషీ కపూర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment