
ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓషివారా శ్మశాన వాటికలో అతని అంత్యక్రియలు నిన్న(సెప్టెంబర్ 3న) కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహా నటుల ఆధ్వర్యంలో జరిగాయి. అతని అంతిమయాత్రలో ప్రముఖ నటి, డ్యాన్సర్ సంభావన సేత్, తన భర్త అవినాష్ ద్వివేదితో కలిసి పాల్గొన్నారు. కాగా, తన భర్తతో ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించాడంటూ నటి గొడవ పడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
చదవండి : Fact Check: ఈ వీడియోలో ఉన్నది నిజంగా సిద్ధార్థ్ శుక్లానా?
సంభావన, అవినాష్ దంపతులు మిగతా స్నేహితులతో కలిసి సిద్ధార్థ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశాన వాటికకు చేరుకున్నారు. అయితే గేట్ వద్ద పోలీస్ అఫిషియల్స్ వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఓ అధికారి అవినాష్ టీ షర్టు పట్టుకొని, ముఖంపై చేయి వేసి నెట్టగా నటి కోపంతో అరుస్తూ అతనితో గొడవకి దిగింది. నన్ను కూడా కొట్టండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
"అవినాష్‌ని ఎందుకు టచ్ చేశావ్?" అంటూ సంభావన స్నేహితులు సైతం అధికారి వైపు చూస్తూ కోపాన్ని వెళ్లగక్కారు. కాగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంభావనకు పలువురు నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. ఏ కారణం లేకుండా అవినాష్‌ని ఎలా కొడతారంటూ ఫైర్ అవుతున్నారు.
చదవండి : భావోద్వేగం: ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న ‘సిద్‌నాజ్’
Comments
Please login to add a commentAdd a comment