
రజనీకాంత్ ఫొటో షేర్ చేసిన బాలీవుడ్ నటుడు
ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్ నిరాడంబరత, వినమ్రత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన అణకువ గురించి మరో అగ్ర కథానాయకుడు వెల్లడించమే విశేషం. రజనీకాంత్ నిరాడంబరత తనను ఎంతోగానో ఆకట్టుకుందని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ పేర్కొన్నాడు. అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో రజనీకాంత్ చూపిన వినమ్రత చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.
అమెరికా ఎయిర్ పోర్టులో తనిఖీ సందర్భంగా 'కబాలి' స్టార్ చాలా నమ్రతగా వ్యవహరించారని వెల్లడించారు. అంతేకాదు అమెరికా ఎయిర్ పోర్టులో రజనీకాంత్ ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. రజనీకాంత్ వినమ్రతను తాను గౌరవిస్తానని పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి 1986లో 'దోస్తానీ దుష్మాణి' సినిమాలో నటించారు.
Simplicity of a huge superstar.Checking in at at an airport in the US for India.Respect for your humility- Rajnikant pic.twitter.com/yBn6sjGqbK
— Rishi Kapoor (@chintskap) 26 July 2016