
ప్రముఖ నటుడు రిషీ కపూర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దంపతులు పరామర్శించారు. అనారోగ్య కారణాల రీత్యా రిషీ కపూర్ గత ఎనిమిది నెలలుగా న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల న్యూయార్క్ వెళ్లిన ముకేశ్, నీతా అంబానీలు రిషీ కపూర్‌ను కలిశారు. ఈ విషయాన్ని రిషీ కపూర్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. అలాగే ముఖేశ్, నీతాలతో కలిసి దిగిన ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ముఖేశ్ దంపతులకు ధన్యవాదములు తెలిపిన రిషీ కపూర్.. ‘వీ ఆల్ సో లవ్ యూ’ అని పేర్కొన్నారు.
Thank you for seeing us Mukesh and Neeta. We also love you. pic.twitter.com/bYzi5Bt9N5
— Rishi Kapoor (@chintskap) May 19, 2019
రిషీ కపూర్ భార్య నీతూ కపూర్ కూడా అంబానీ దంపతులతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఇటీవల డెక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం ముగిసిందని... ప్రస్తుతం తనకు క్యాన్సర్ నయమైందని రిషీ కపూర్ చెప్పారు.