
మా అబ్బాయి సినిమాలు నచ్చవు!
‘‘మా అబ్బాయి చాలా బాగా నటించాడు. ఒక తండ్రిగా నేను చెప్పకూడదు గానీ తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు’’... ఇలాంటి మాటలు తమ వారసులను సినీ రంగానికి పరిచయం చేసిన చాలా మంది తారల మాటల్లో వినబడుతూ ఉంటాయి. కానీ రిషీ కపూర్ మాత్రం తన కొడుకు రణ బీర్ కపూర్ నటన నచ్చదని అంటున్నారు. ‘‘నిజంగా నాకు రణబీర్ నటన ఇష్టం ఉండదు.
అతని సినిమాలకు నేను మంచి క్రిటిక్‌ను కాను. నేనసలు రణబీర్ సినిమాలు గురించి ఆలోచించను. నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించే కొద్దీ, ‘ఆ సీన్‌లో ఎందుకలా నటించాడు?’ అనిపిస్తుంది. నేను వాటిని చర్చిస్తే, రణబీర్ నాతో ఏకీభవించకపోవచ్చు. అందుకే చూసి వదిలేయడం బెటర్ అనుకున్నాను’’ అని రిషీ కపూర్ చెప్పుకొచ్చారు.