పాపం.. రణ్‌బీర్..! | Ranbir Kapoor: 'My life has become a reality show' | Sakshi
Sakshi News home page

పాపం.. రణ్‌బీర్..!

Published Tue, Jun 24 2014 11:04 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పాపం.. రణ్‌బీర్..! - Sakshi

పాపం.. రణ్‌బీర్..!

బాలీవుడ్‌లోని ఈతరం నటుల్లో అదృష్టవంతుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం రణ్‌బీర్ కపూర్. అందానికి అందం.., నటనకు నటన.., తల్లిదండ్రులే గాడ్‌ఫాదర్ పాత్ర పోషిస్తుండడంతో బాలీవుడ్‌లో అతగాడికి దేనికీ కొదవలేకుండా పోయింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తనలోని ప్రతిభను కూడా చాటిచెప్పాడు ఈ యువ నటుడు. అయితే రణ్‌బీర్ మాత్రం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నిన్నమొన్నటిదాకా బాగానే ఉన్నా ఇటీవల తనపై వస్తున్న పుకార్లతో జీవితం తలకిందులవుతున్నట్లు అనిపిస్తోందంటున్నాడు. 
 
 పుకార్లు తన జీవితాన్ని ‘రియాల్టీ షో’గా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనపై వస్తున్న పుకార్లను చూసి తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని, ఈ వయసులో వారినలా చూస్తుండడం తనకు కూడా ఎంతో బాధగా ఉందంటున్నాడు. ‘తల్లిదండ్రులతో రణ్‌బీర్ గొడవపడ్డాడని, తండ్రి రిషి కపూర్.. రణ్‌బీర్‌ను ఇంట్లోనుంచి వెళ్లగొట్టాడని, రణ్‌బీర్ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడని రకరకాల కథనాలు మీడియాలో ప్రసారమవుతున్నాయి. వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమవుతున్నాయి. మరికొందరైతే కత్రినాతో కలసి వెళ్లిపోతున్నాడని కూడా రాస్తున్నాయి. 
 
 ఆమెతో వెళ్లిపోవడానికి నేనెవర్ని? నాకింకా పెళ్లి కాలేదు. అలాంటిదేదైనా ఉంటే నేరుగా మీడియా ముందుకు వచ్చి నేనే చెబుతాను. అప్పటిదాకా ఇలాంటి పనులను మానుకుంటే మంచిద’న్నాడు. అనురాగ్ కశ్యప్ చిత్రం ‘బాంబే వెల్వెట్’ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం ‘జగ్గా జాసూస్’ చిత్రంలో నటిస్తున్నానని చెప్పాడు. ఇందులో కథానాయిక కత్రినా కైఫ్ కావడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement