కపూర్ అండ్ సన్స్కి 150 కోట్లు
కపూర్ అండ్ సన్స్కి 150 కోట్లు
Published Wed, Apr 13 2016 2:34 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM
కథలో బలం ఉంటే స్టార్ ఇమేజ్తో పనిలేదన్న విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇటీవల బాలీవుడ్లో రిలీజ్ అయిన కపూర్ అండ్ సన్స్, భారీ వసూళ్లను రాబడుతుండటమే ఇందుకు నిదర్శనం. సూపర్ స్టార్లు లేకపోయిన కథాబలంతోనే ఈ సినిమా సంచలనాలను నమోదు చేస్తోంది. మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కపూర్ అండ్ సన్స్, ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇందులో 105 కోట్ల వరకు భారత్లోనే సాధించగా, మరో 45 కోట్లు ఓవర్ సీస్లో కొల్లగొట్టింది.
సిద్దార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, ఆలియా భట్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రిషీకపూర్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ వయసులో కూడా రిషీ కపూర్ ప్రొస్థటిక్ మేకప్తో తాత పాత్రలో నటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరో కీలక పాత్రలో రత్నా పాఠక్ ఆకట్టుకుంది. కుటుంబ సంబందాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
Advertisement
Advertisement