
రణ్‌బీర్ కపూర్, రోబర్ట్ డి నీరో, రిషీ కపూర్
రోబర్ట్ డి నీరో.. హాలీవుడ్‌లో అద్భుతమైన యాక్టర్. రిషీ కపూర్ మనదగ్గర సూపర్ యాక్టర్. రణ్‌బీర్ కపూర్ యంగ్ యాక్టర్స్‌లో మంచి మార్కులు కొట్టేస్తున్న నటుడు. ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ప్రస్తుతం సాధారణ మెడికల్ చెకప్ కోసం న్యూయార్క్‌లో ఉన్నారు రిషీ కపూర్. అక్కడ ఆయన చేస్తున్న పనులన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా రోబర్ట్ డి నీరోని కలిశారట. ‘‘వావ్ మూమెంట్ ఇది. అనుకోనుండా డి నీరోని కలిశాం. తనకి ఆల్రెడీ రణ్‌బీర్ తెలుసు. స్టార్‌డమ్ ఉన్నప్పటికీ నీరో సింపుల్‌గా ఉన్నారు. నేను చాలా దురుసుగా ఉంటానని అర్థం అయింది. అతని ప్రవర్తనకి ఫిదా అయిపోయా ’’ అని పై ఫొటోను షేర్ చేశారు రిషీ కపూర్.
Comments
Please login to add a commentAdd a comment