ఆ శక్తి నాలో ఉంది | Amitabh Bachchan challenges Karan Johar on social media | Sakshi
Sakshi News home page

ఆ శక్తి నాలో ఉంది

Published Mon, Apr 30 2018 1:21 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Amitabh Bachchan challenges Karan Johar on social media - Sakshi

అమితాబ్‌ బచ్చన్‌

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో సూపర్‌ యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు తెలియజేస్తుంటారు. ఆయన ఓ బ్లాగ్‌ను కూడా రన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా మీ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? అనే ప్రశ్న అమితాబ్‌ ముందుంచితే  ‘‘సోషల్‌ మీడియాలో ఉన్న నా ఫాలోవర్స్‌ అందరికీ రెస్పాండ్‌ అవ్వడం సాధ్యం కాని పని. కానీ ఇంట్రెస్టింగ్‌గా ఏదైనా విషయం అనిపిస్తే తప్పకుండా పూర్తిగా చదువుతాను. మనలోని మరో కోణాన్ని తెలుసుకోవడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి.

నా సినిమాల గురించి వారు ఏవైనా విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిస్తే వాటిని నా డైరెక్టర్స్‌తో పంచుకుంటాను. కానీ అన్నిసార్లు సోషల్‌ మీడియాలో పొగడ్తలే రావు. మన పోస్ట్‌లకు కొన్నిసార్లు తిట్లు, వ్యతిరేకత, విమర్శలు కూడా వస్తాయి. వాటిని హ్యాండిల్‌ చేయగల మెచ్యూరిటీ మనలో ఉండాలి. ఆ శక్తి నాలో ఉంది. నేను ఒక తప్పు చేస్తే ఒప్పుకుని దిద్దుకుంటాను. మనలో ఉన్న నెగిటివ్‌ పాయింట్స్‌ను ఎవరైనా ఎత్తి చూపినప్పుడు ఆవేశపడకూడదు. విశ్లేషించుకోవాలి. అప్పుడే జీవితంలో మరింత ముందుకు వెళ్లగలుగుతాం’’ అని చెప్పుకొచ్చారు అమితాబ్‌. ఉమేశ్‌ శుక్లా దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, రిషీకపూర్‌ నటించిన ‘102 నాటౌట్‌’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement