సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ నటుడు రిషి కపూర్ మరణం ఆయన కుటుంబానికే కాదు యావత్ సినీ ప్రపంచానికే తీరని లోటు. గురువారం ఆయన ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని చందన్‌వాడి క్రిమెటోరియమ్‌లో జరిగాయి. దీనికి కుమారుడు రణబీర్, భార్య నీతూ సింగ్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్ పాల్గొన్నారు. కుమార్తె రిధిమ చివరి చూపుకు హాజరు కాలేకపోవడం విషాదం. మరోవైపు బాలీవుడ్ నటీనటులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. (వందలమందికి ఒకే పేరు, ఒకే ఫోన్ నంబర్)
ఇదిలా వుండగా రిషి కపూర్ చివరి వీడియో ఇదేనంటూ ఆయన ఆసుపత్రిలో సంభాషించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి "దీవానా" చిత్రంలో "తేరీ దర్ సే దిల్ అబాద్ రహా" పాటను ఆలపించాడు. బెడ్‌పై పడుకుని ఉన్న రిషి అతని పాటను ఆస్వాదించడమే కాక వెరీగుడ్ అంటూ అభినందించారు. అనంతరం అతనికి ఆశీస్సులు అందజేశారు. ఇక ఈ వీడియో గతంలో ఆసుపపత్రిలో చేరినప్పటిది అయి వుండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓ ఆంగ్ల మీడియా సైతం అది పాత వీడియోనే అని తేల్చి చెప్పింది. కాగా ‘మేరా నామ్ జోకర్’తో వెండితెరకు పరిచయమైన రిషి కపూర్ గత రెండేళ్లుగా బ్లడ్ కేన్సర్‌తో బాధ పడిన విషయం తెలిసిందే. (బాబీ హీరో మరి లేడు)
చదవండి: రిషీ కపూర్ అనే నేను
Comments
Please login to add a commentAdd a comment