ఆ హీరోయిన్‌తో నాకు ఎఫైర్‌ ఉందని.. | Sanjay Thought I Was Having Affair With Tina Munim - By Rishi Kapoor | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్‌తో నాకు ఎఫైర్‌ ఉందని..

Published Thu, Jan 19 2017 12:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

ఆ హీరోయిన్‌తో నాకు ఎఫైర్‌ ఉందని..

ఆ హీరోయిన్‌తో నాకు ఎఫైర్‌ ఉందని..

ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రిషి కపూర్ తన ఆత్మకథ ఖుల్లాం ఖుల్లాలో సంచలన, వివాదాస్పద విషయాలను వెల్లడించారు. హీరోయిన్లతో తనకు ఎఫైర్స్ ఉన్నట్టు పుకార్లు రావడం, వాటిపై భార్య నీతు స్పందన గురించి ఈ పుస్తకంలో రాశారు.  

తనకు వివాహం కాకముందు బాలీవుడ్‌ హీరోయిన్‌ టీనా మునిమ్‌తో ఎఫైర్‌ ఉన్నట్టు మరో హీరో సంజయ్‌ దత్‌ అనుమానించాడని రిషి కపూర్‌ పేర్కొన్నారు. అప్పట్లో టీనా సంజయ్ పట్ల ఆకర్షితురాలైందని వెల్లడించారు. మీడియా ఈ విషయం గురించి ప్రస్తావించలేదని, కానీ కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం తనకు టీనాతో సీక్రెట్‌ ఎఫైర్ ఉందని భావించేవారని తెలిపారు. ఈ విషయం తెలియగానే ఓ రోజు సంజయ్‌ దత్‌, గుల్షన్ గ్రోవర్‌తో కలసి  తనతో గొడవ పడటానికి నీతూ ఇంటికి వచ్చారని వివరించారు. ఇద్దరి మధ్య గొడవ కాకుండా నీతూ పరిష్కారం చేసిందని వెల్లడించారు. తనకు, టీనాకు మధ్య ఎపైర్‌ లేదని, ఈ పుకార్లు నిరాధారమని, కేవలం కో స్టార్‌లుగా స్నేహంగా ఉంటారని.. సంజయ్‌కు నీతూ చెప్పి నమ్మించడంతో వివాదం ముగిసిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రస్తావన వచ్చినపుడు తాను, సంజయ్‌ నవ్వుకునేవాళ్లమని తెలిపారు. ఈ సంఘటన జరిగాక నీతూ, తాను వివాహం చేసుకున్నామని, తమ పెళ్లికి తన హీరోయిన్లు అందరూ వచ్చారని వెల్లడించారు.

పెళ్లయిన తర్వాత డింపుల్‌ కపాడియాతో తనకు ఎఫైర్‌ ఉందని పుకార్లు వచ్చాయని రిషి కపూర్‌ పుస్తకంలో రాశారు. తనపై నీతూకు నమ్మకముందని, ఈ విషయం గురించి ఆమె ఆందోళన చెందలేదని తెలిపారు. డింపుల్‌ తనకు స్నేహితురాలు మాత్రమేనని పేర్కొన్నారు. తామిద్దరం బాబీ సినిమాలో నటించామని, తర్వాత సాగర్‌ సినిమా చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement