రెండు జీన్స్‌ కొంటే.. ఒక బొచ్చె ఫ్రీ! | Bipasha, Rishi Kapoor tweets on Thong Jeans goes viral | Sakshi
Sakshi News home page

రెండు జీన్స్‌ కొంటే.. ఒక బొచ్చె ఫ్రీ!

Published Mon, Oct 30 2017 2:10 PM | Last Updated on Mon, Oct 30 2017 2:15 PM

Bipasha, Rishi Kapoor tweets on Thong Jeans goes viral

ముంబై : తొంగ్‌ జీన్స్‌.. ప్రపంచ ఫ్యాషన్‌ రంగాన్ని ఓ కుదుపు కుదుపుతోన్న నయా ట్రెండ్. టోక్యో ఫ్యాషన్‌ వీక్‌లో తొలిసారిగా ప్రదర్శితమైన ఈ వింత మోడల్‌ జీన్స్‌పై దేశదేశాల సెలబ్రిటీలు భిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటీమణులు బిపాషా బసూ, మలైకా అరోరా, సీనియర్‌ నటుడు రిషీ కపూర్‌లు తమదైన శైలిలో చేసిన పోస్టులు వైరల్‌ అయ్యాయి.  

నేకెడ్‌ జీన్స్‌ : డెనిమ్‌ అంటే తనకెంతో ఇష్టమన్న బిపాషా.. ఫ్యాషన్‌ పేరుతో జీన్స్‌ పరువు తీయకండంటూ డిజైనర్లను వేడుకున్నారు. ‘ఇది చాలా బాధాకరం. అసలక్కడ ఏముంది? నెకెడ్‌ జీన్స్‌ కాకుంటే!’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్‌ చేశారు. మరో నటి మలైకా అరోరా.. బిప్స్‌ కామెంట్లను సమర్థించారు.

రెండు కొంటే ఒక బొచ్చె ఫ్రీ : సెటైరికల్‌ కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే సీనియర్‌ యాక్టర్‌ రిషీ కపూర్‌ను సైతం తొంగ్‌ జీన్స్‌ స్పందించేలా చేశాయి. ‘‘ఇలాంటివి రెండు జీన్స్‌ కొంటే అడుక్కుతినడానికి ఒక బొచ్చె ఫ్రీ.. త్వరపడండి!’ అంటూ రిషీ చేసిన ట్వీట్‌ వేల సార్లు రీట్వీట్‌ అయింది.

తొంగ్‌ జీన్స్‌ పేరుతో డిజైనర్‌ మెయికో బాన్‌ రూపొందించిన ఈ దుస్తులను ఇటీవల టోక్యోలో జరిగిన అమెజాన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ప్రదర్శించారు. ఫస్ట్‌లుక్‌లోనే చూపరులకు కిరాక్‌ పుట్టించిన తొంగ్‌ జీన్స్‌.. అప్పటి నుంచీ వార్తల్లో ఉంటూవస్తోంది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement