![Janhvi Kapoor: I Have Become More Confident In Lockdown - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/13/Janhvi-Kapoor1.jpg.webp?itok=EqblwybC)
దివంగత నటి శ్రీదేవీ పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్వారంటైన్ క్లిప్‌ను షేర్ చేసింది. ఇందులో తను చిన్న వయసులో అమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న వీడియో మొదలు ఇప్పటివరకు దిగిన ఫొటోలు, వీడియోలు అన్నింటినీ ఒకే దగ్గర చేర్చింది. ఈ దృశ్య మాలికకు తను వాయిస్ ఓవర్ అందించింది. ఈ వీడియోలో జాన్వీ తన తల్లి శ్రీదేవీ పక్కన అమ్మకూచిలా కనిపిస్తుంటే, తండ్రి బోనీ కపూర్ దగ్గర గారాలు పోతోంది. ఇక చెల్లి ఖుషీ కపూర్‌తో కుప్పిగంతులేస్తోంది. అల్లరి పిల్లగా అలరిస్తోంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. బాల్యంలోనైనా, ఇప్పటికైనా డ్యాన్స్‌ను విడవనంటోంది. ఇక ఈ వీడియో జాన్వీ కపూర్ ఎవరు? అన్న ప్రశ్నతో ప్రారంభం అవుతుంది. మళ్లీ తనే ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్లి.. "నాలో అమ్మ, నాన్న, చెల్లి అందరూ ఉన్నారు. నేను ఒక్కో పరిస్థితుల్లో ఒక్కోలా మారిపోతాను. దీన్ని నా స్నేహితులు ఊసరవెల్లి అంటారు. (అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన లారా దత్తా)
నేను బిజీగా ఉంటాను, ప్రయాణాలు చేస్తాను. కాబట్టి నేను ఆశించినంతగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం లేదు. నాన్న ఒంటరిగా ఉన్నాడు. ఆయనకు నేనింకా ఎక్కువ సమయం కేటాయించాలి. కానీ ఇప్పుడున్న లాక్‌డౌన్ వల్ల అది సాధ్యం అవట్లేదు. మీరే మూడో వ్యక్తిగా మారి మీ జీవితాల్ని తరచి చూసుకోండి. నాకు నేను ఎక్కువ సమయం కేటాయించుకోవడం వల్ల మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాను. కాబట్టి అందరూ పాజిటివ్‌గా ఉండండి. ఇంట్లో కుటుంబంతో కలిసి ఉండటాన్ని అదృష్టంగా భావించండి. మీరు బయటకు వెళ్లలేకపోతే ఇంట్లోకే అడుగులు వేయండి" అంటూ వీడియోను ముగించింది. కాగా జాన్వీ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది. (వైరల్.. వేదికపై డ్యాన్స్ చేసిన జాన్వి)
Comments
Please login to add a commentAdd a comment