
ఇర్ఫాన్ ఖాన్, ప్రముఖ బాలీవుడ్ నటుడు (ఫైల్ ఫొటో)
ముంబయి : న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఏ ఆయుర్వేధ వైద్యుడిని సంప్రదించడం లేదని ఆయన వ్యక్తిగత అధికారిక ప్రతినిధి స్పష్టం చేశారు. ఒకసారి మాత్రం ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు వైద్య బాలెందు ప్రకాష్‌తో ఫోన్‌లో మాట్లాడారని ఆతర్వాత, వారిద్దరి మధ్య ఎలాంటి పరస్పర సంభాషణలు లేవని చెప్పారు.
'అంతకుముందు మీడియాలో వచ్చినట్లు ఆయన వైద్యబాలేందు ప్రకాష్‌ను సంప్రదించడం లేదు. కానీ, ఒకసారి మాత్రం ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి సంభాషణలు గానీ, సంప్రదింపులుగానీ జరగలేదు. అయితే, మీకు వ్యక్తిగత ప్రయోజనాలకోసం, పబ్లిసిటీ కోసం ఒకరి అనారోగ్యంపై మీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేయడం ఏమాత్రం అంగీకరించదగినది కాదు' అని ఆయన అన్నారు. ఇర్ఫాన్ ఖాన్ న్యూరో సంబంధ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై పలు విధాలుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment