
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (పాత ఫొటో)
ముంబై : నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యంపై సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలను ఆయన మీడియా ప్రతినిధి ఖండించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం బాగా క్షీణించిందని, మరికొన్ని రోజులే ఆయన బతికివుంటారనే పుకార్లు వ్యాపించాయి. ఈ వార్తలను ఇర్ఫాన్ మీడియా ప్రతినిధి తీవ్రంగా ఖండించారు.
న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్‌తో ఇర్ఫాన్ ఖాన్ బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ వ్యాధికి యూకేలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, చికిత్సకు ఇర్ఫాన్ సరిగా స్పందించడం లేదని, ఆయన బతకడం కష్టమేనని సోషల్‌మీడియాలో వదంతులు వ్యాపించాయి.
సోషల్‌మీడియాలో వస్తున్న వదంతుల ఆధారంగా ఇర్ఫాన్‌పై వార్తలు ప్రచురించొద్దని ఆయన మీడియా ప్రతినిధి పత్రికా సంస్థలను కోరారు.
న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ అంటే ఏమిటీ?
ఇది నాడీ సంబంధమైన కణితి(ట్యూమర్). వేగంగా లేదా నెమ్మదిగా లేదా ఊహించని విధంగా పెరగొచ్చు. శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకొచ్చు. చాలా మందికి దీని లక్షణాలు అంత త్వరగా తెలియవు గుర్తించలేరు. ఏదైనా సంఘటన జరిగి దాని ద్వారా పరీక్షలు చేస్తే బయటపడుతుంది. చర్మం కందిపోయినట్లుగా కనిపించడం లేదా రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోవడం జరుగుతాయి. ఇక వైద్యం అనేది కణితి తీవ్రతను బట్టి ఉంటుంది. రేడియేషన్ లేదా కీమోథెరపీ ద్వారా మాత్రమే చికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment