అరుదైన వ్యాధిపై స్పందించిన నటుడి భార్య | Irrfan Wife Sutapa Sikdar Opens Up On His Rare Disease | Sakshi

‘ఇర్ఫాన్‌ ఖాన్‌ యోధుడు’

Mar 10 2018 1:25 PM | Updated on Mar 10 2018 2:17 PM

Irrfan Wife Sutapa Sikdar Opens Up On His Rare Disease - Sakshi

భార్య సుతప సిక్దార్‌తో ఇర్ఫాన్‌ ఖాన్‌

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కొద్ది రోజులుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల స్పందించిన ఇర్ఫాన్‌, తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తానే స్వయంగా వెల్లడిస్తానని అప్పటి వరకు పుకార్లు నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా ఈ విషయంపై ఇర్ఫాన్ సతీమణి సుతమ సిక్దార్‌ స్పందించారు. ప్రస్తుత తన పరిస్థితిని భావోద్వేగంగా అభిమానులతో పంచుకున్నారు.

‘నా స్నేహితుడు, నా జీవిత భాగస్వామి ఓ యోధుడు. ఆయన ప్రతీ అడ్డంకిని అద్భుతమైన ప్రతిభతో అందంగా దాటుతున్నారు. కొద్ది రోజులుగా ఫోన్‌ కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించనందుకు అందరు క్షమించాలి. మీ అందరూ ఇర్ఫాన్‌ ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవుడు, ఇర్ఫాన్‌ నాకు కూడా పోరాడే శక్తిని అందిస్తున్నారు. ప్రస్తుతం నేను గెలుపు కోసం యుద్ధభూమిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టాను. అది అంత సులభం కాదని నాకు తెలుసు. 

కానీ కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు ఇర్ఫాన్‌లు నాకు తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం కలిగిస్తున్నారు. అందరికీ అసలేం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉందని తెలుసు, కానీ అలా మీ శక్తిని వృధా చేయకుండా ఏం జరగాలని కోరుకుంటున్నారో అందుకోసం ప్రార్ధించండి’ అంటూ తన సందేశాన్ని ఫేస్‌బుక్‌ పేజ్‌లో షేర్‌ చేశారు.ఇర్ఫాన్‌ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న బ‍్లాక్‌మెయిల్‌, పజిల్‌, కర్వాన్‌, రైతా చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement