Warrior
-
శభాష్ వాలంటీర్ నువ్వు సేవా వారియర్..!
-
'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..'
లక్నో: అంబానీ, అదానీ దేశంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు, మీడియాను కొన్నట్లుగా రాహుల్ గాంధీని కొనలేరని వ్యాఖ్యానించారు ప్రియాంక గాంధీ. తన సోదరుడు వారియర్ అని కొనియాడారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా లోని సరిహద్దులో ఘన స్వాగతం పలికారు ప్రియాంక. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు. దాదాపు 3,000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన తన సోదరుడ్ని చూస్తే గర్వంగా ఉందని ప్రియాంక అన్నారు. రాహుల్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ రూ.కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయిందని పేర్కొన్నారు. తన సోదరుడు యుద్ధవీరుడని ప్రశంసించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీషర్ట్లోనే కన్పిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన టీషర్టే ధరించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ విషయంపై ప్రియాంక స్పందిస్తూ తన సోదరుడికి సత్యం అనే రక్షణ కవచం ఉందని, అందుకే చలికాలంలో టీషర్టులు ధరించినా అతనికి ఏమీ కాదని పేర్కొన్నారు. मेरे भाई सत्य का कवच पहनकर चल रहे हैं। : @priyankagandhi जी#BharatJodoYatra pic.twitter.com/chp3baB0Pb — Congress (@INCIndia) January 3, 2023 కాంగ్రెస్‌కు పునరుత్తేజం తీసుకురావడమే లక్ష్యంగా సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను కన్యాకుమారిలో ప్రారంభించారు రాహుల్ గాంధీ. 150 రోజులు, 3,500 కిలోమీటర్లు కవర్ చేస్తూ కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుంది. రాహుల్ పాదయత్రలో పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో కొనసాగుతోంది. చదవండి: 'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్‌బై.. -
డిస్నీప్లస్ హాట్ స్టార్ లో "వారియర్" స్ట్రీమింగ్..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "ది వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో రామ్ కి జోడీగా యంగ్, టాలెంటెడ్, మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తున్నారు. పందెం కోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం సినిమాలు అందించిన దర్శకుడు లింగుస్వామి ఈ విభిన్నమైన కథకి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలిపి ఒక పండగ భోజనంలా వడ్డించారు. డాక్టర్ నుంచి పోలీస్ గా మారడం అనే ఆలోచన తెలుగు ప్రేక్షకులకు కొత్త. దర్శకుడు లింగుసామి ఆ ప్రయత్నాన్ని కమర్షియల్ సక్సెస్ చేశారు. ఇక డీఎస్పీ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్కడవిన్నా ఈ పాటలు మారుమోగిపోతున్నాయి. ప్రేక్షకులకు నచ్చే మరెన్నో విషయాలు వున్న ఈ మంచి ఫామిలీ ఎంటర్ టైనర్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిస్ కాకుండా చూడండి. స్ట్రీమింగ్ ఇప్పటికే మొదలైంది. "వారియర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కండలు తిరిగిన దేహం.. పొడవాటి జుట్టు; అదరహో ధోని
టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త అవతారంలో కనిపించనున్నాడు. మాములుగానే ధోని మంచి ఫిజిక్‌తో ఉంటాడు. అలాంటి ధోని ఈసారి కండలు తిరిగిన దేహంతో .. పొడవాటి జుట్టుతో .. చేతిలో కత్తులతో యుద్ధంలో శత్రువులపై దాడికి సిద్ధంగా ఉన్నాడు. ఇదేంటి ధోని సినిమాల్లో ఏమైనా కనిపిస్తున్నాడా అని సందేహం వద్దు. ఒక యానిమేటెడ్ గ్రాఫిక్స్ నవల కోసం ధోని వారియర్ అవతారమెత్తాడు. అథర్వ అనే టైటిల్‌తో తొందర్లోనే రానున్న ఈ నవలకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అథర్వ అనే సూపర్ హీరో క్యారెక్టర్లో మెరుస్తున్న ధోని.. తన లుక్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. కాగా ఈ నవలను రమేశ్ తమిల్మని రాశారు. చదవండి: IPL 2022 Auction: ధోని దృష్టికి జూనియర్ 'మలింగ'.. సీఎస్కే దక్కించుకోనుందా! మోషన్ పోస్టర్‌కు సంబంధించిన టీజర్‌ను ధోని స్వయంగా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అథర్వ అనే కొత్త అవతారంలో కనిపించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇందులోని స్టోరీ, ఆర్ట్‌వర్క్‌తో ప్రతీ ఒక్కరు లీనమవుతారని.. ముఖ్యంగా కామిక్ లవర్స్‌కు ఇదో పెద్ద పండుగలా కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో నాలుగోసారి సీఎస్కేను విజేతగా నిలబెట్టిన ధోని.. మరోసారి సీఎస్కే కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక ఫిబ్రవరి 12,13న జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో సీఎస్కే ఎవరిని కొనుగోలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి:Daryl Mitchell: ఆ ఒక్క నిర్ణయం.. ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది -
అలుపెరగని సేవకి... డాక్టర్ పద్మావతి!
గురజాల: గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల పీహెచ్సీలో పనిచేస్తోన్న డాక్టర్ జి.పద్మావతి కోవిడ్ వారియర్‌గా కరోనా రోగులకు నిర్విరామ సేవలు అందిస్తున్నారు. పీహెచ్సీలో పద్మావతితో పాటు మరో డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ సెలవులో ఉండటంతో పద్మావతి ఒక్కరే సేవలు అందిస్తున్నారు. అనుమానితులకు కరోనా పరీక్షలు చేయించడం నుంచి వ్యాక్సినేషన్ వరకు అన్నీ డాక్టర్ పద్మావతి పర్యవేక్షిస్తున్నారు. నిత్యం పీహెచ్సీ పరిధిలో పదుల సంఖ్యలో కరోనా టెస్టులు, వందల సంఖ్యలో కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మాడుగుల పీహెచ్సీ పరిధిలో 95 మందికి పైగా కరోనా రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించి, వారికి సలహాలిచ్చి త్వరగా కొలుకునే విధంగా పద్మావతి చర్యలు తీసుకుంటున్నారు. వరండాలోనే నిద్ర... డాక్టర్ పద్మావతికి పదేళ్లు, ఏడేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజూ వైద్యశాలలో కోవిడ్ అనుమానితులకు పరీక్షలు చేయించిన తరువాత ఇంటికి వెళ్తే పిల్లలకు ఇబ్బందులు వస్తాయనే భావనతో వారిని తన పుట్టింటికి పంపించారు. విధుల అనంతరం ఇంటికి వెళ్లినా బయట నుంచే తన భర్త శ్రీహర్ష, అత్త బాగోగులు తెలుసుకుంటున్నారు. ఇంటి వరండాలో ఉన్న గదిలోనే నిద్రిస్తున్నారు. భర్త కూడా వైద్యుడు కావడంతో ఆమెను ప్రోత్సహిస్తున్నారు. సేవలోనే సంతృప్తి.. కోవిడ్ రోగులకు సేవ చేయడం ఎంతో తృప్తినిస్తోంది. రామాపురానికి చెందిన ఒక వృద్ధుడు కోవిడ్ బారిన పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటే, అతని కుమారుడు ఆస్పత్రికి తీసుకురావడం కుదరదని చెప్పాడు. వెంటనే అతని ఇంటికి ప్రైవేట్ అంబులెన్సును పంపి, అతనికి ఆక్సిజన్ అందించి గుంటూరుకు రిఫర్ చేయడంతో ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ప్రాణాలను కాపాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది. – జి పద్మావతి, మాడుగుల పీహెచ్సీ వైద్యురాలు -
అరుదైన వ్యాధిపై స్పందించిన నటుడి భార్య
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొద్ది రోజులుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల స్పందించిన ఇర్ఫాన్, తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తానే స్వయంగా వెల్లడిస్తానని అప్పటి వరకు పుకార్లు నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా ఈ విషయంపై ఇర్ఫాన్ సతీమణి సుతమ సిక్దార్ స్పందించారు. ప్రస్తుత తన పరిస్థితిని భావోద్వేగంగా అభిమానులతో పంచుకున్నారు. ‘నా స్నేహితుడు, నా జీవిత భాగస్వామి ఓ యోధుడు. ఆయన ప్రతీ అడ్డంకిని అద్భుతమైన ప్రతిభతో అందంగా దాటుతున్నారు. కొద్ది రోజులుగా ఫోన్ కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించనందుకు అందరు క్షమించాలి. మీ అందరూ ఇర్ఫాన్ ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవుడు, ఇర్ఫాన్ నాకు కూడా పోరాడే శక్తిని అందిస్తున్నారు. ప్రస్తుతం నేను గెలుపు కోసం యుద్ధభూమిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టాను. అది అంత సులభం కాదని నాకు తెలుసు. కానీ కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు ఇర్ఫాన్‌లు నాకు తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం కలిగిస్తున్నారు. అందరికీ అసలేం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉందని తెలుసు, కానీ అలా మీ శక్తిని వృధా చేయకుండా ఏం జరగాలని కోరుకుంటున్నారో అందుకోసం ప్రార్ధించండి’ అంటూ తన సందేశాన్ని ఫేస్బుక్ పేజ్‌లో షేర్ చేశారు.ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న బ్లాక్మెయిల్, పజిల్, కర్వాన్, రైతా చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. -
అలుపెరగని యోధుడు కాళోజీ
కలెక్టర్ జగన్మోహన్ కలెక్టరేట్లో ఘనంగా కాళోజీ జయంతి ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా సమస్యలపై పోరాడిన అలుపెరగని కలం యోధుడు కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ జగన్మోహన్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాళోజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అనంతరం డీఆర్వో సంజీవరెడ్డి తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా గోరటి వెంకన్నకు కాళోజీ అవార్డు రావడం అభినందనీయమన్నారు. సమావేశంలో టీఎన్జీవో కార్యదర్శి వనజారెడ్డి, ట్రెజరీ అధికారి షాహిద్ అలీ, కలెక్టరేట్ కార్యాలయ పర్యవేక్షకులు, అసిస్టెంట్లు, అధికారులు పాల్గొన్నారు. ఆశయ సాధనకు కషి చేయాలి : మంత్రి అల్లోల నిర్మల్‌టౌన్ : కాళోజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని రాష్ట్ర దేవాదాయ, గహనిర్మాణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో శుక్రవారం కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కాళోజీ సేవలను గుర్తు చేశారు. ఇందులో ఆర్డీవో శివలింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, వైస్ చైర్మన్ అజీంబిన్ యాహియా, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.