ప్రజా సమస్యలపై పోరాడిన అలుపెరగని కలం యోధుడు కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా నిర్వహించారు.
-
కలెక్టర్ జగన్మోహన్
-
కలెక్టరేట్‌లో ఘనంగా కాళోజీ జయంతి
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా సమస్యలపై పోరాడిన అలుపెరగని కలం యోధుడు కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ జగన్మోహన్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాళోజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అనంతరం డీఆర్వో సంజీవరెడ్డి తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా గోరటి వెంకన్నకు కాళోజీ అవార్డు రావడం అభినందనీయమన్నారు. సమావేశంలో టీఎన్జీవో కార్యదర్శి వనజారెడ్డి, ట్రెజరీ అధికారి షాహిద్ అలీ, కలెక్టరేట్ కార్యాలయ పర్యవేక్షకులు, అసిస్టెంట్లు, అధికారులు పాల్గొన్నారు.
ఆశయ సాధనకు కషి చేయాలి : మంత్రి అల్లోల
నిర్మల్‌టౌన్ : కాళోజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని రాష్ట్ర దేవాదాయ, గహనిర్మాణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో శుక్రవారం కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కాళోజీ సేవలను గుర్తు చేశారు. ఇందులో ఆర్డీవో శివలింగయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, వైస్ చైర్మన్ అజీంబిన్ యాహియా, ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.