‘‘ఇర్ఫాన్ ఖాన్ ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారు. స్నేహం, ప్రేమ రూపంలో బతికే ఉంటారు. వీధి బాలల ఆలోచనల్లో ఆయన ఉంటారు. కాబట్టి ఆయనను గతం అని సంబోధించలేను’’ అంటూ దర్శకురాలు మీరా నాయర్ ఇర్ఫాన్ ఖాన్ గురించి ఉద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో హోం టూ హోం ఫండరైజర్ కార్యక్రమం.. ‘‘ఐ ఫర్ ఇండియా’’ ఫేస్‌బుక్ లైవ్‌లో ఆదివారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా... ఇర్ఫాన్ ఖాన్‌కు నివాళులు అర్పించారు. విలక్షణ నటుడిగా పేరొందిన ఇర్ఫాన్ తొలి సినిమా సలాం బాంబేకు మీరా నాయర్ దర్శకురాలన్న సంగతి తెలిసిందే.(దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు)
ఈ క్రమంలో కెరీర్ తొలినాళ్ల నుంచే అతడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే వాడని మీరా తెలిపారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఇర్ఫాన్ ఇప్పుడు ఈ లోకాన్ని వీడినా.. అతడి స్ఫూర్తితో నటులు ముందుకు సాగాలన్నారు. ‘‘ఉపఖండంలో ఎంతో మంది నటులపై నీ ప్రభావం ఉంది. నిన్ను చూసి ఈ రంగంలోకి అడుగుపెట్టిన వారిలో నీ స్ఫూర్తి రగిల్చిన జ్వాల ఆరిపోలేదు. సినీ పరిశ్రమకు నువ్వు చేసిన సేవ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అని నీకు తెలుసు. నువ్విచ్చిన వారసత్వాన్ని ఇక్కడున్న వాళ్లు కొనసాగిస్తారు. నిన్ను చాలా మిస్సవుతున్నాం’’ అని మీరా నాయర్ ఇర్ఫాన్ ఖాన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. కాగా కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ గత బుధవారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం విదితమే.(ఇర్ఫాన్ భార్య సుతప భావోద్వేగ పోస్టు)
Comments
Please login to add a commentAdd a comment