ఇర్ఫాన్ ఖాన్‌‌ వీడియో షేర్‌ చేసిన బాబిల్‌ | Irrfan Khan Son Babil Shares His Father Swimming Video | Sakshi
Sakshi News home page

‘ఆయన జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు’

Published Tue, May 5 2020 4:15 PM | Last Updated on Tue, May 5 2020 4:48 PM

Irrfan Khan Son Babil Shares His Father Swimming Video - Sakshi

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియోను ఆయన కుమారుడు బాబిల్‌ మంగళవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. గత వారం ఆయన క్యాన్సర్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఇర్ఫాన్‌ పెద్ద కుమారుడు బాబిల్‌ తండ్రి జ్ఞపకాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఇర్ఫాన్‌ ఐస్ కోల్డ్‌‌ వాటర్‌లో స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియోను అభిమానులకు కోసం షేర్‌ చేశాడు. స్విమ్మింగ్‌ చేయడానికి నీళ్లలోకి దూకిన ఇర్ఫాన్‌ ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయని చెప్తున్న ఈ వీడియోను బాబిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో‌ షేర్‌ చేశాడు. ఇక వీడియోకు నటుడు అనూప్‌ సోనీ, ఇషాన్‌ ఖత్తర్‌లు హర్ట్‌ ఎమోజీతో తమ స్పందనను తెలిపారు. (థాంక్యూ: ఉద్వేగానికి లోనైన ఇర్ఫాన్‌ కుమారుడు)


అంతేగాక ఇర్ఫాన్‌‌తో డిస్కవరి ఆఫ్‌ ఇండియాలో కలిసి నటించిన విపిన్‌ శర్మ ‘‘ఇర్ఫాన్‌కు స్విమ్మింగ్‌ అంటే ఇష్టం. డిస్కవరి ఆఫ్‌ ఇండియా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఆ షూటింగ్‌ స్పాట్‌ పక్కనే ఒక చిన్న సరస్సు ఉంది. ఇక ఇర్పాన్‌ ఆ సరస్సులో స్విమ్మిగ్‌ చేయడానకి తెగ ఆసక్తిని చూపాడు. షూటింగ్‌ ఆయ్యాక ఆయన ఆ సరస్సులో ఈత కోడుతుంటే నేను బయట ఒడ్డు మీద కుర్చుని ఆయనతో కబుర్లు చెప్పాను’’ అంటూ కామెంట్‌లో రాసుకొచ్చాడు. చల్లని నీళ్లలో కూడా స్విమ్మింగ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఇర్ఫాన్‌ వీడియోకు నెటిజన్లు ‘బాబిల్‌ ఆయన ఎప్పుడూ నీతో, మీ కుటుంబంతోనే ఉన్నారు. అలాగే మా అందరితో కూడ ఉంటారు. ధైర్యంగా ఉండు, మీ అమ్మని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన జ్ఞాపకాలను పంచుకున్నందుకు బాబిల్‌కు అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. (నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్‌ భార్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement