వీడియో లీక్‌పై స్పందించిన ఊర్వశి రౌతేలా | Urvashi Rautela Comments On Her Video | Sakshi
Sakshi News home page

వీడియో లీక్‌పై స్పందించిన ఊర్వశి రౌతేలా

Published Sun, Jul 28 2024 11:26 AM | Last Updated on Sun, Jul 28 2024 11:26 AM

Urvashi Rautela Comments On Her Video

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బాత్‌రూమ్ వీడియో లీక్‌ అయిందంటూ ఒక క్లిప్పింగ్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఆమె తన మేనేజర్‌తో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్‌ కూడా లీక్‌ అయింది.  ఆ వీడియో ఎలా బయటకొచ్చిందంటూ ఊర్వశి మాట్లాడిన మాటలు ఆన్‌లైన్‌లోకి రావడంతో ఈ టాపిక్‌ పెద్ద దుమారమే రేపింది. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి పక్కన డ్యాన్స్‌ వేసిన ఈ బ్యూటికి తెలుగులో కూడా పాపులారటీ ఉంది. ఆయితే, ఆమె పర్సనల్‌ వీడియో అంటూ వైరల్‌ అయిన క్లిప్పింగ్‌ గురించి ఊర్వశి తాజాగా రియాక్ట్‌ అయింది.

అందరూ అనుకునేలా ఆ వీడియో లీక్‌ అవడం నిజమేనని ఊర్వశి రౌతేలా ఇలా చెప్పుకొచ్చింది. 'నేను బాలీవుడ్‌లో గుస్పేటియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో భాగంగా ఓ సీన్‌ కోసం అలా నటించాను. కానీ, అది ఇటీవల నెట్టింట లీక్‌ కావడంతో నేను చాలా బాధపడ్డాను. కనీసం సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు.. అప్పుడు ఇలా వీడియోలు, ఫోటోలు లీక్‌ కావడం విచిత్రంగా ఉంది. అయితే, నేను అందరికీ చెప్పేది ఒక్కటే.. ఆ వీడియో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు. మరోకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకూడదని ఆశిస్తున్నాను.' అని ఊర్వశి చెప్పుకొచ్చింది.

ఈ విషయంపై ఊర్వశి రౌతేలాపై నెటిజన్లు మండి పడుతున్నారు. వీడియో లీక్‌ అయింది సరే.. మేనేజర్‌తో మాట్లాడిన కాల్‌ ఎలా లీక్‌ అయిందంటూ వారు ఫైర్‌ అవుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని వారు చెప్పుకొస్తున్నారు. బాత్‌రూమ్‌ వీడియో లీక్‌ చేసుకుంటూ సినిమా ప్రమోషన్‌ చేసుకునే స్థాయికి చేరావా..? అంటూ ఊర్వశి రౌతేలాను తిట్టిపోస్తున్నారు. ఆమె నటించిన గుస్పేటియా చిత్రం ఆగష్టు 9న విడుదల కానుంది. అక్షయ్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటించగా.. సూషి గణేషన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలో కూడా ఊర్వశి నటిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement