
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గతకొంతకాలంగా లండన్‌లో ఉంటూ.. క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ముంబై విమానాశ్రయంలో అకస్మాత్తుగా ఆయన కనిపించడంతో అభిమానులు, ఫొటోగ్రాఫర్లు ఆనందానికి లోనయ్యారు. కానీ, ఇంతలోనే ఇర్ఫాన్ తన ముఖం కనిపించకుండా చొక్కాతో కవర్ చేసుకున్నారు. కనీసం ఫొటోలకు పోజు ఇవ్వలేదు. పైగా వీల్‌చైర్‌పై ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్లారు. ముఖాన్ని దాచుకొనే ఆయన తన కారులో ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయన ఇలా ఎందుకు వెళ్లిపోయారు కారణాలు తెలియరాలేదు.
గత ఏడాది మార్చిలో తాను అనారోగ్యానికి గురైనట్టు.. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఇర్ఫాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ముఖం దాచుకొని వెళ్లడం ఆరోగ్యపరంగా ఆయన పరిస్థితి బాగాలేదనే సంకేతాలను ఇస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.