తిరువనంతపురం : చనిపోయిన వారికి అంతిమ కర్మలు నిర్వహించడం సాధారణ విషయం. కానీ ప్రాణాలతో ఉన్న వ్యక్తి చనిపోయాడని భావించి అతని జీవితాన్ని అర్ధాతరంగా ముంగించబోయారు అధికారులు. ఈ విచిత్ర సంఘటన కేరళలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో శివదాసన్ అనే వ్యక్తి మరణించడంతో మృతదేహాన్ని ఫోటో తీసేందుకు ఫోటోగ్రాఫర్ టామీ థామస్‌ను పోలీసులు పిలిపించారు. ఈ ఫోటోలు కోర్టు విచారణలో సాక్షాలుగా వాడేందుకు పోలీసులు ఫోటోగ్రాఫర్‌ను రప్పించారు. (ప్రేమిస్తే తాళి కట్టించుకో, లేదా కత్తితో పోడిపించుకో)
మృతదేహాన్ని ఫోటో తీసేందుకు సిద్ధ పడ్డ టామీకి ఓ వింతైన అనుభవం ఎదురైంది. మృతదేహం దగ్గర ఏదో అలికిడి వినిపించడంతో ఉలిక్కిపడ్డ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి చూశాడు. చనిపోయాడని భావిస్తున్న శివదాసన్ ఊపిరి పీల్చుకోవడం పరీక్షించిన టామీ అతడు బతికే ఉన్నాడని గ్రహించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు అతన్ని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అసలు చనిపోయింది శివదాసన్ వాళ్ల బంధువు. అయితే శివదాసన్ తలకు కూడా గాయమై కింద పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో బంధువులు అతను చనిపోయాడని భావించి దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. (కరోనాతో సీఐ మృతి.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి)
శివదాసన్ అదృష్టం కొద్ది చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఫోటో గ్రాఫర్ టామీ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవలేదని అన్నారు. మృతదేహం ఉన్న గదిలో వెలుతురు తక్కువ ఉన్నందున స్పష్టత కోసం శరీరం దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కానీ ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకోవడం విన్నప్పుడు ముందుగా భయమేసిందని, ఆతర్వాత పోలీసులకు విషయం తెలిపినట్లు పేర్కొన్నారు. (ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..)
Comments
Please login to add a commentAdd a comment