Presumed Dead
-
చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించిన ఫోటోగ్రాఫర్!
తిరువనంతపురం : చనిపోయిన వారికి అంతిమ కర్మలు నిర్వహించడం సాధారణ విషయం. కానీ ప్రాణాలతో ఉన్న వ్యక్తి చనిపోయాడని భావించి అతని జీవితాన్ని అర్ధాతరంగా ముంగించబోయారు అధికారులు. ఈ విచిత్ర సంఘటన కేరళలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో శివదాసన్ అనే వ్యక్తి మరణించడంతో మృతదేహాన్ని ఫోటో తీసేందుకు ఫోటోగ్రాఫర్ టామీ థామస్‌ను పోలీసులు పిలిపించారు. ఈ ఫోటోలు కోర్టు విచారణలో సాక్షాలుగా వాడేందుకు పోలీసులు ఫోటోగ్రాఫర్‌ను రప్పించారు. (ప్రేమిస్తే తాళి కట్టించుకో, లేదా కత్తితో పోడిపించుకో) మృతదేహాన్ని ఫోటో తీసేందుకు సిద్ధ పడ్డ టామీకి ఓ వింతైన అనుభవం ఎదురైంది. మృతదేహం దగ్గర ఏదో అలికిడి వినిపించడంతో ఉలిక్కిపడ్డ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి చూశాడు. చనిపోయాడని భావిస్తున్న శివదాసన్ ఊపిరి పీల్చుకోవడం పరీక్షించిన టామీ అతడు బతికే ఉన్నాడని గ్రహించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు అతన్ని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అసలు చనిపోయింది శివదాసన్ వాళ్ల బంధువు. అయితే శివదాసన్ తలకు కూడా గాయమై కింద పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో బంధువులు అతను చనిపోయాడని భావించి దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. (కరోనాతో సీఐ మృతి.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి) శివదాసన్ అదృష్టం కొద్ది చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఫోటో గ్రాఫర్ టామీ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవలేదని అన్నారు. మృతదేహం ఉన్న గదిలో వెలుతురు తక్కువ ఉన్నందున స్పష్టత కోసం శరీరం దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కానీ ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకోవడం విన్నప్పుడు ముందుగా భయమేసిందని, ఆతర్వాత పోలీసులకు విషయం తెలిపినట్లు పేర్కొన్నారు. (ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..) -
మోడల్ చనిపోయినట్లు ట్రోల్స్
ఇస్లామాబాద్ : అసభ్యకరమైన వస్త్రధారణతో సంప్రదాయాన్ని విస్మరించిందంటూ పాకిస్తాన్ మోడల్, నటి జరా అబిద్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే గత శుక్రవారం కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో మోడల్ జరా అబిద్ మరణించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన సమయంలో జరా అదే విమానంలో ప్రయాణించినట్లు ఆమె స్నేహితులు భావిసున్నారు. అయితే పీఐఏ విమాన ప్రమాద ఘటనలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయట పడినట్లు పాక్ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో జరా విమానంలో ఉందా? లేదా? అన్న దానిపై ఇప్పటివరకు సరైన స్పష్టతలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు తొలగించబడ్డాయి. ఆమె ట్విటర్, ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలను ఎవరు తొలగించారనే విషయంలో స్పష్టత లేదు. అయితే ఈ క్రమంలో జరా అబిద్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై కొంతమంది నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పాకిస్తాన్ మహిళలు సమాజంలో సంప్రదాయ వస్త్రాలను ధరించి నిరాడంబరంగా ఉంటారు. అయితే జరా మాత్రం సంప్రదాయ వస్తాధారణకు విరుద్ధంగా ఉంది’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘శరీర భాగాలను కనిపించేలా దుస్తులు ధరించిన ఆమెను అల్లా ఎప్పటికీ ఇష్టపడడు. జన్నాత్(స్వర్గం)లో స్వచ్చమైన పురుషులు, మహిళలకు మాత్రమే ఆర్హత ఉంటుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇక ఆమె మృతిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ఆ బాధితులకు షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: తమిళనాడులోని తాంబరం విమానాశ్రయంనుంచి అకస్మాత్తుగా కనబడకుండా పోయిన విమానానికి సంబంధించి అధికారులు ఒక ప్రకటన చేశారు. తమవారు ఎప్పటికైనా తిరిగి వస్తారని ఆశగా ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలకు షాకింగ్ న్యూస్ అందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఏఎన్ 32లో ప్రయాణిస్తున్న 29 మందీ చనిపోయారని భావిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బాధితుల కుటుంబాలకు సమాచారం అందించారు. బీమా తదితర ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలని కోరినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా జూలై 22న భారత వాయుసేన విమానానం గల్లంతైంది. దాదాపు నెలన్నర పాటు 17 షిప్ లు, ఓ సబ్ మెరైన్, 23 విమానాలు మాయమైన వాయుసేన విమానం కోసం భారీ స్థాయిలో అన్వేషన కొనసాగించారు. విమానం జాడ కనుక్కోవడంలో విఫలమై సెర్చింగ్ ను నిలిపివేసిన అధికారులు ఈ మేరకు ప్రకటించారు.దీంతోపాటు జూలైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ విషయంపై అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ, వారంతా మరణించివుండవచ్చని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.