Ernakulam district
-
కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం!
తిరువనంతపురం: కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వరపుజ, అంగమలి, ఎడపల్లి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఆదివారం ఉదయం 9.20కి ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా అక్కడున్నవారు భయాందోళనకు గురై హాలు నుంచి బయటకు పరుగులు తీశారు. #WATCH | Kerala: Outside visuals from Zamra International Convention & Exhibition Centre, Kalamassery; one person died and several others were injured in an explosion here. pic.twitter.com/RILM2z3vov — ANI (@ANI) October 29, 2023 ఇక, పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయాలు కాగా.. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తీవ్రమైన గాయాలతో వున్న క్షత్రగాత్రులను కొచ్చి మెడికల్ కాలేజీ నుంచి కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలిస్తున్నారు. అయితే, ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 ఇక, పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారు. ఘటనా స్థలానికి డీజీపీ వెళ్లారు. పేలుడు ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: డీకే శివకుమార్ వెంట 70 మంది ఎమ్మెల్యేలు..! -
ఆ స్కూల్లో బాలబాలికలకు యూనిఫామ్ ఒకటే!
సాధారణంగా పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా యూనిఫామ్స్ ఉంటాయి. కానీ ఆ స్కూల్లో మాత్రం బాలురు, బాలికలకు ఒకేరకమైన యూనిఫామ్ ఉంటుంది. ఈ పాఠశాల మన దేశంలోనే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. లింగ సమానత్వాన్ని ప్రబోధించేందుకే బాల బాలికలకు ఒకే రకమైన ఏకరూప దుస్తుల ధరించేలా చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల సహకారంతో ఈ నిశ్శబ్ద విప్లవానికి తొలి అడుగుపడింది. విద్యార్జనలో అగ్రస్థానాన ఉన్న కేరళలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎర్నాకులం జిల్లాలో వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిశ్శబ్ద విప్లవానికి అంకుర్పారణ జరిగింది. లింగ భేదం లేకుండా ఇక్కడ విద్యార్థులందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరిస్తారు. చొక్కాలు, త్రిబైఫోర్త్ షార్ట్స్ వేసుకుని చదువులమ్మ ఒడిలో ఒదిగిపోతున్నారు. బాలికలు ఎటువంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా ఆటపాటలతో చదువుకుంటున్నారు. (ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!) వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, లోయర్ ప్రైమరీ విభాగాలు ఉన్నాయి. రెండు విభాగాల్లో మొత్తం 746 మంది విద్యార్థులు ఉన్నారు. లింగ సమానత్వ యూనిఫామ్ మొదట 2017లో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు 1 నుంచి 4 తరగతులకు విస్తరించారు. లింగ సమానత్వ యూనిఫామ్ ప్రవేశపెట్టడానికి ముందు బాలికలు ఆటలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంకోచించే వారని.. ఇప్పుడు వారిలో ఎటువంటి సంకోచం లేదని ఉపాధ్యాయురాలు సి.రాజీ తెలిపారు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ అమలు చేశామన్నారు. ‘బాలికలకు ఇబ్బందిగా ఉన్న డ్రెస్ కోడ్ మార్చాల్సిందేనని విద్యార్థినుల తల్లులు బలంగా విశ్వసించారు. తమ కుమార్తెలు తాము ధరించే యూనిఫామ్‌లో సురక్షితంగా ఉండాలని వారు కోరుకున్నారు. కొత్త యూనిఫామ్ అదనపు ఖర్చును భరించడానికి వారు ముందుకు వచ్చార’ని రాజీ వెల్లడించారు. ‘లింగ సమానత్వ ఏకరూప దుస్తులు ప్రవేశపెట్టడం వల్ల అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎక్కువ మంది బాలికలు క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తుండటం ఇందుకు నిదర్శనం. కొత్త డ్రెస్ కోడ్ వారికి గొప్ప స్వేచ్ఛను అందించింది. మా పాఠశాలలో 378 మంది బాలికలు ఉన్నారు. వీరిలో అత్యధికులు పేదవారే. కానీ తల్లిదండ్రులు కొత్త యూనిఫామ్ కోసం అదనంగా డబ్బులు చెల్లించడానికి అంగీకరించారు. అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నార’ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేపీ సుమ అన్నారు. 2019లోనే జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ ప్రవేశపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కాస్త ఆలస్యమైందని తెలిపారు. కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టడంతోనే ఆగిపోలేదు.. విద్యార్థుల కోసం జెండర్-సెన్సిటివ్ పాఠాలను కూడా సిద్ధం చేశారు ఉపాధ్యాయులు. బాలురు, బాలికలు ఇద్దరూ సమానమే అని చెప్పేవిధంగా పాఠాలు బోధిస్తున్నట్టు అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ బినోయ్ పీటర్ చెప్పారు. లింగ సమానత్వ మాడ్యూల్‌ను ప్రోత్సహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా, వలయన్చిరంగార పాఠశాల చేపట్టిన ఈ ప్రయత్నాన్ని కేరళ విద్యా మంత్రి ఆర్ బిందు, సినీ నటి మంజు వారియర్, ఒలింపియన్ అంజు బాబీ జార్జ్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించిన ఫోటోగ్రాఫర్!
తిరువనంతపురం : చనిపోయిన వారికి అంతిమ కర్మలు నిర్వహించడం సాధారణ విషయం. కానీ ప్రాణాలతో ఉన్న వ్యక్తి చనిపోయాడని భావించి అతని జీవితాన్ని అర్ధాతరంగా ముంగించబోయారు అధికారులు. ఈ విచిత్ర సంఘటన కేరళలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో శివదాసన్ అనే వ్యక్తి మరణించడంతో మృతదేహాన్ని ఫోటో తీసేందుకు ఫోటోగ్రాఫర్ టామీ థామస్‌ను పోలీసులు పిలిపించారు. ఈ ఫోటోలు కోర్టు విచారణలో సాక్షాలుగా వాడేందుకు పోలీసులు ఫోటోగ్రాఫర్‌ను రప్పించారు. (ప్రేమిస్తే తాళి కట్టించుకో, లేదా కత్తితో పోడిపించుకో) మృతదేహాన్ని ఫోటో తీసేందుకు సిద్ధ పడ్డ టామీకి ఓ వింతైన అనుభవం ఎదురైంది. మృతదేహం దగ్గర ఏదో అలికిడి వినిపించడంతో ఉలిక్కిపడ్డ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి చూశాడు. చనిపోయాడని భావిస్తున్న శివదాసన్ ఊపిరి పీల్చుకోవడం పరీక్షించిన టామీ అతడు బతికే ఉన్నాడని గ్రహించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు అతన్ని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అసలు చనిపోయింది శివదాసన్ వాళ్ల బంధువు. అయితే శివదాసన్ తలకు కూడా గాయమై కింద పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో బంధువులు అతను చనిపోయాడని భావించి దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. (కరోనాతో సీఐ మృతి.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి) శివదాసన్ అదృష్టం కొద్ది చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఫోటో గ్రాఫర్ టామీ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవలేదని అన్నారు. మృతదేహం ఉన్న గదిలో వెలుతురు తక్కువ ఉన్నందున స్పష్టత కోసం శరీరం దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కానీ ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకోవడం విన్నప్పుడు ముందుగా భయమేసిందని, ఆతర్వాత పోలీసులకు విషయం తెలిపినట్లు పేర్కొన్నారు. (ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..) -
ఎటు చూసినా కన్నీటి గాథలే
ఊహించని విలయం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నీటి ప్రవాహం ముంచెత్తడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రాణాలు దక్కించుకున్నారు. బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీశారు. ప్రకృతి ప్రకోపం చల్లారింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి కొంతమంది ఇప్పుడిప్పుడే ఇళ్లకు వస్తున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న సామాగ్రి.. ఎటు చూసిన బురద.. వారికి దర్శనమిచ్చాయి. ఆ ఇంట్లోని వస్తువులను తలచుకుంటూ, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కన్నీటి వరదలో ఇళ్లను పునర్నిర్మించుకునే పనిలో పడ్డారు. ఒక్క క్షణం ఆలస్యమైతే బతికేవాడ్ని కాదు ‘మా ఇంట్లోకి పది అడుగుల వరకు నీళ్లు వచ్చేశాయి. ఐదు రోజుల పాటు ఆ నీళ్లు అలానే ఉన్నాయి.. ప్రస్తుతం మా ఇల్లు యుద్ధభూమిని తలపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ఎర్నాకుళం జిల్లాలోని మంజలే గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం. ‘ఆగస్టు 14వ తేదీ రాత్రి నీటి ప్రవాహం మా ఇంటివైపు రావడం గమనించాను. వెంటనే మా పక్కింటి వాళ్లను అప్రమత్తం చేసి మా మొదటి అంతస్తులోకి నేను, నా భార్య వెళ్లిపోయాం. సురక్షితంగా ఉన్నామని భావించా. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగింది. ట్రెరస్కు కొద్ది దూరం వరకు నీళ్లు వచ్చేశాయి. స్థానికులు ఓ పడవలో వచ్చి మమ్మల్ని రక్షించారు. మొదట నా భార్య పడవలోకి వెళ్లింది. నేను ఆమె చీరను పట్టుకుని పడవలోకి దూకేందుకు ప్రయత్నించాను. అయితే కాలు జారి నీళ్లలో పడిపోయాను. వెంటనే బోటులో ఉన్న వారు స్పందించి నన్ను పట్టుకుని పైకి తీశారు. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే నా ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి’ అంటూ ఆనాటి భయానక సంఘటనను గుర్తు చేసుకున్నారు సలాం. ‘గోడకు ఉన్న అల్మారాలో నా ఇద్దరు పిల్లలు స్కూలు, కాలేజీ రోజుల్లో సాధించిన ట్రోఫీలు, మెడల్స్ భద్రంగా దాచాను. వరదలకు అవి కొట్టుకుపోయాయి. ఆ ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సర్టిఫికెట్లు మాత్రమే మిగిలాయి.. చాలకుడి ప్రాంతానికి చెందిన సురేష్ జాన్ కుటుంబం రెండంతస్తుల భవనంలో ఉంటున్నారు. పది అడుగుల వరకు నీళ్లు రావడంతో ఇంట్లో వారి కుక్కను వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇంటి నుంచి పునరావాస కేంద్రానికి వెళ్లారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఇంటికి చేరారు. బురద, మరకలతో భయంకరంగా భయంకరంగా ఉన్న గోడలు వారికి దర్శనమిచ్చాయి. ఫర్నీచర్ అంతా ఓ చోట కూప్పగా పడి ఉంది. పుస్తకాలు అల్మారాలోనే నానిపోయి ఉన్నాయి. ప్రతీ గదిలోనూ బురద పేరుకుపోయింది. ‘ఇంటి పరిస్థితి చూస్తే నాకు మాటలు రావడం లేదు. నేను చాలా విచారంలో ఉన్నాను. సర్వం కోల్పోయాను, మా కుటుంబం మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. నా దగ్గర డబ్బులు కూడా లేవు’ అంటూ జాన్ కన్నీటి పర్యంతమయ్యారు. మొదటి అంతస్తులో ఉందామని మొదట అనుకున్నాం. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంప్‌కు వెళ్లాం. నా బట్టలు, పాత, కొత్త పుస్తకాలు, ఫైల్స్, పేపర్లు అన్నీ పాడైపోయాయి. సర్టిఫికెట్లు జాగ్రత్తగా దాచుకోవడంతో అవి మాత్రమే మిగిలాయి’.అంటూ వాపోయారు ఎల్సా జాన్. అయితే, వారి కుక్క మాత్రం సురక్షితంగా తిరిగి వచ్చింది. మానసిక ఆందోళనలో ఉన్నారు ఓ పునరావాస కేంద్రంలో ఉన్న ఓ వృద్ధుడు ఛాతిలో నొప్పిగా ఉందని క్యాంప్‌లో సేవలందిస్తున్న వైద్యుడు రఫీక్‌ను కలిశాడు. అతన్ని పరీక్షించిన వైద్యుడు.. రోగం సంగతి ఎలా ఉన్నా ‘ముందు నువ్వు మీ ఇంటికి వెళ్లొద్దు.. మీ కొడుకు ఇల్లు మొత్తం శుభ్రం చేశాకే ఇంటికి వెళ్లు’ అని చెప్పాడు. దీన్ని బట్టి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ‘ఎంతో కష్టపడి చాలా మంది తమ ఇళ్లను నిర్మించుకున్నారు. ఆ ఇంటితో వారికి విడదీయరాని బంధం, అనుబంధం ఉంటుంది. ఇప్పుడున్న స్థితిలో ఆ ఇంటిని చూస్తే వారు తట్టుకోలేరు. వారంతా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. శారీరకంగా ధృడంగా ఉన్న వారు కూడా బోరున విలపిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు డాక్టర్ రఫీక్. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పోలీసుల కస్టడీలో రేప్ నిందితుడు
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన దళిత న్యాయ విద్యార్థిని హత్యాచారం కేసులో కీలక నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి రవి ధ్రువీకరించారు. ఈ ఘటన చోటు చేసుకున్న దాదాపు 50 రోజుల తర్వాత పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. ఏప్రిల్ 28న ఎర్నాకులం జిల్లాలో దళిత విద్యార్థినిపై అత్యాచారం చేసి, అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. దీంతో ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సిట్ ఏర్పాటు చేసింది. అనుమానితుడి ఊహా చిత్రాలు విడుదల చేశారు. మృతురాలి ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.