తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన దళిత న్యాయ విద్యార్థిని హత్యాచారం కేసులో కీలక నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి రవి ధ్రువీకరించారు. ఈ ఘటన చోటు చేసుకున్న దాదాపు 50 రోజుల తర్వాత పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు.
ఏప్రిల్ 28న ఎర్నాకులం జిల్లాలో దళిత విద్యార్థినిపై అత్యాచారం చేసి, అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. దీంతో ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సిట్ ఏర్పాటు చేసింది. అనుమానితుడి ఊహా చిత్రాలు విడుదల చేశారు. మృతురాలి ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
పోలీసుల కస్టడీలో రేప్ నిందితుడు
Published Thu, Jun 16 2016 2:04 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement