
రేప్ చేసి, కత్తులతో పొడిచి..
త్రివేండ్రం: లా చదువుతున్న దళిత విద్యార్థిని అత్యాచారం చేసి, కడుపుపై తన్ని, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలో జరిగింది. గత నెల 28న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.
ఎర్నాకుళం జిల్లా పెరుంబవూర్లో బాధితురాలు మానసిక స్థితి సరిగా లేని తల్లితో కలసి నివసించేది. ఈ నెల 28న ఆమె మృతదేహం బయటపడింది. ఆమె ఒంటిపై పలు కత్తిపోట్లు ఉన్నాయి. కడుపుపై తన్నడంతో ప్రేగులు బయటకు వచ్చాయి. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. పట్టపగలే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఇరుగుపొరుగువారు నోరు విప్పలేదు. దారుణం జరిగి ఐదు రోజులు కావాస్తున్నా పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితురాలి కుటుంబానికి సాయం చేసేందుకు స్థానిక రాజకీయ నాయకులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ముందుకు రాలేదు. రెండు రోజుల తర్వాత బాధితురాలి హత్యాచారం వార్త పేపర్లో రావడంతో ఆమె స్నేహితులకు తెలిసింది. బాధితురాలి ఇంట్లోనే ఈ దారుణం జరిగి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.