ఫొటోగ్రాఫర్లకు హీరోయిన్‌ వార్నింగ్‌! | Angry Katrina Kaif threatens paparazzi yet again | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్లకు హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Published Sat, Jul 30 2016 12:00 PM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM

ఫొటోగ్రాఫర్లకు హీరోయిన్‌ వార్నింగ్‌! - Sakshi

ఫొటోగ్రాఫర్లకు హీరోయిన్‌ వార్నింగ్‌!

బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌కు ఫొటోగ్రాఫర్లు అంటే అస్సలు పడదు. ఎవరైనా తనను వెంటాడి ఫొటోలు తీస్తే.. ఆమెకు కోపం నషాలానికి ఎక్కుతోంది. ఎక్కడపడితే అక్కడ తనను క్లిక్‌ మనిపించడం అస్సలు నచ్చదు. ఈ విషయమై గతంలోనే ఫొటోగ్రాఫర్లకు కత్రినా ఓసారి ఘాటు హెచ్చరికలు చేసింది. తన పర్మిషన్ తీసుకోకుండా ఫొటోలు తీస్తే.. పోలీసు కేసు పెడతానని బెదిరించింది.

తాజాగా మరోసారి కత్రిన ఫొటోగ్రాఫర్లపై చిందులు తొక్కింది. శుక్రవారం కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య స్టూడియోలో డ్యాన్స్‌ రిహార్సల్‌ అనంతరం కత్రిన బయటకు వచ్చింది. అనంతరం ఆమె కారులోకి ఎక్కుతుండగా అక్కడ ఉన్న కొందరు ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. అంతే కోపంతో ఊగిపోయిన కత్రిన కారు దిగి వచ్చి మరీ ఫొటోగ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తనకు తెలియకుండా ఫొటోలు తీస్తే.. పోలీసు కేసు పెడతానని ఆమె హెచ్చరించినట్టు సమాచారం.

ప్రస్తుతం వరల్డ్ టూర్‌ కోసం కత్రిన రిహార్సల్స్‌ చేస్తోంది. కత్రినకు శుక్రవారం అనారోగ్యంగా ఉండటంతో డాక్టర్‌ స్టూడియోకు వచ్చారని, డాక్టర్‌ సూచనలతో ఆమె అర్థాంతరంగా రిహార్సల్స్‌ మానుకొని ఇంటికి వెళ్లిందని, ఈ నేపథ్యంలో ఫొటోగ్రాఫర్ల తీరు ఆమెకు కోపం తెప్పించి ఉండొచ్చునని సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతంలో రణ్‌బీర్‌ కపూర్‌తో బ్రేకప్‌ అయిందని వార్తలు వచ్చిన సమయంలోనూ కత్రిన ఫొటోగ్రాఫర్లను ఇదేవిధంగా బెదిరించింది. సెలెబ్ మేనేజర్ రేష్మా శెట్టితో వెళుతుండగా ఫొటోలు తీయడంతో ఆమె ఫొటో జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement