గోవాలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పప్పులో కాలేశారు. సుభాష్ ఫల్‌దేశాయ్ అనే ఈయన తన అనచరులతో కలిసి తిరగేసిన జెండా ముందు ఉన్నట్లుగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది.
గోవాలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పప్పులో కాలేశారు. సుభాష్ ఫల్‌దేశాయ్ అనే ఈయన తన అనచరులతో కలిసి తిరగేసిన జెండా ముందు ఉన్నట్లుగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. అయితే, దుష్టశక్తులు కొన్ని కావాలనే ఫొటోషాప్‌లో జెండాను కావాలని తిరగేసి అలా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవాలు జరుగుతున్న సందర్భంలో వాట్సప్‌లో ఎమ్మెల్యే ఫొటో విపరీతంగా షేర్ అయ్యింది.
దీనిపై తనకు చాలా ఫోన్లు వచ్చాయని ఎమ్మల్యే ఫల్‌దేశాయ్ చెప్పారు. సంగ్యూమ్ అనే ప్రాంతంలో జరిగిన ఉత్సవాల సందర్భంగా తీసిన తన ఫొటో తీసుకుని.. వేరే చోట తిరగేసి ఉన్న జెండాతో దాన్ని మార్ఫింగ్ చేశారని ఆయన తెలిపారు. ఫొటోషాప్‌లో రెండు ఫొటోలను కలపడం పెద్ద కష్టమేమీ కాదని, తన ప్రతిష్ఠను మంటగలపడానికి కావాలనే ఇలా చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.