కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదగలమా.. కానీ తిమింగలం తోక పట్టుకుని అవార్డుల సాగరాన్ని మాత్రం అవలీలగా ఈదేయొచ్చట. ఇది మేం చెప్పడం లేదు.. జపాన్‌కు చెందిన రికో తకహషి చెబుతోంది. ఎందుకంటే.. ఆమె తీసిన ఈ హంప్‌బ్యాక్ వేల్ (తిమిం గలం) పిల్లకు సంబంధించిన చిత్రం ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2018 పోటీలో అన్ని విభాగాలకు కలిపి గ్రాండ్ ప్రైజ్ విన్నర్‌గా నిలిచింది. జ్యూరీ బృందం ప్రశంసలను అందుకుంది.
వివిధ దేశాల నుంచి తుది పోటీకి మొత్తం 13 వేల ఎంట్రీలు రాగా.. ‘మత్స్య కన్య’ పేరిట రికో తకహషి తీసిన ఈ చిత్రం తొలి స్థానా న్ని దక్కించుకుంది. దీంతోపాటు ‘నేచర్’విభాగంలో నూ ఈ చిత్రం విజేతగా నిలిచింది. అండర్ వాటర్ ఫొటోగ్రఫీ అంటే పడిచచ్చే తకహషి.. తన ఆశయ సాధ న కోసం ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టారు. తిమింగలాలు వాటి పిల్లలతో కలిపి ఉన్న ఫొటోను తీయాలని అనుకున్నానని.. అయితే.. ఈ తిమింగలం పిల్ల కొంతసేపు తన తల్లిని వదిలేసి.. తమ వద్దకు వచ్చి.. తోకను అలా దగ్గరగా ఆడించినప్పుడు తానీ ఫొటోను క్లిక్‌మనిపించినట్లు తకహషి చెప్పారు. ఈ చిత్రాన్ని ఆమె జపాన్‌లోని కుమిజిమా ద్వీప సముద్ర గర్భంలో తీశారు.
ప్రశంసలు వేన'వేల్'..
Published Wed, Jul 4 2018 12:53 AM | Last Updated on Wed, Jul 4 2018 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment