National Geographic Traveler Magazine
-
ప్రశంసలు వేన'వేల్'..
కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదగలమా.. కానీ తిమింగలం తోక పట్టుకుని అవార్డుల సాగరాన్ని మాత్రం అవలీలగా ఈదేయొచ్చట. ఇది మేం చెప్పడం లేదు.. జపాన్‌కు చెందిన రికో తకహషి చెబుతోంది. ఎందుకంటే.. ఆమె తీసిన ఈ హంప్‌బ్యాక్ వేల్ (తిమిం గలం) పిల్లకు సంబంధించిన చిత్రం ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2018 పోటీలో అన్ని విభాగాలకు కలిపి గ్రాండ్ ప్రైజ్ విన్నర్‌గా నిలిచింది. జ్యూరీ బృందం ప్రశంసలను అందుకుంది. వివిధ దేశాల నుంచి తుది పోటీకి మొత్తం 13 వేల ఎంట్రీలు రాగా.. ‘మత్స్య కన్య’ పేరిట రికో తకహషి తీసిన ఈ చిత్రం తొలి స్థానా న్ని దక్కించుకుంది. దీంతోపాటు ‘నేచర్’విభాగంలో నూ ఈ చిత్రం విజేతగా నిలిచింది. అండర్ వాటర్ ఫొటోగ్రఫీ అంటే పడిచచ్చే తకహషి.. తన ఆశయ సాధ న కోసం ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టారు. తిమింగలాలు వాటి పిల్లలతో కలిపి ఉన్న ఫొటోను తీయాలని అనుకున్నానని.. అయితే.. ఈ తిమింగలం పిల్ల కొంతసేపు తన తల్లిని వదిలేసి.. తమ వద్దకు వచ్చి.. తోకను అలా దగ్గరగా ఆడించినప్పుడు తానీ ఫొటోను క్లిక్‌మనిపించినట్లు తకహషి చెప్పారు. ఈ చిత్రాన్ని ఆమె జపాన్‌లోని కుమిజిమా ద్వీప సముద్ర గర్భంలో తీశారు. -
హైదరాబాద్ బెస్ట్ సిటీ
కెనడా రోడ్‌షోలో బీపీ ఆచార్య సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకరంగం ప్రాముఖ్యతను సంతరించుకుంటోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్లో బుధవారం నిర్వహించిన టూరిజం రోడ్‌షోలో బీపీ ఆచార్య ప్రసంగించారు. ప్రఖ్యాత నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెలర్ మేగజైన్లో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ రెండో నగరంగా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇండియన్ టూరిజం కార్యాలయంతో పాటు పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ఇండియా శాఖ సంయుక్తంగా ఈ రోడ్‌షోను నిర్వహించాయి. ఉత్తర అమెరికాలోని పలువురు టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.