మోడల్స్తో నకిలీ ట్రంప్ హల్చల్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సొంత ఊరు.. న్యూయార్క్. అక్కడి మాన్ హట్టన్ వీధుల్లో ట్రంప్ పేరుమీద ట్రంప్ టవర్స్, ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్.. లాంటి ఎన్నో వ్యాపారకేంద్రాలున్నాయి. అలాంటి చోట మంగళవారం నకిలీ ట్రంప్ హల్ చల్ చేశాడు. పదుల సంఖ్యలో మోడల్స్ వెంటరాగా అచ్చం ట్రంప్ లాంటి హెయిర్ స్టైల్, హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఇదేదో ఎన్నికల ప్రచారం అనుకునే పొరపాటే!
బ్రిటన్ కు చెందిన మహిళా ఫొటోగ్రాఫర్ అలిసన్ జాక్సన్ పేరెప్పుడైనా విన్నారా? స్పూప్ ఫొటోగ్రాఫర్ గా ఆమె వరల్డ్ ఫేమస్. సెలబ్రిటీలను పోలీనవ్యక్తులను వెతికిపట్టుకుని ఫొటో ఆల్బమ్స్ రూపొందిస్తుంది. తాజాగా డోనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఆల్బంను కూడా తయారుచేసింది. అందులో చికాగోకు చెందిన 63 ఏళ్ల వ్యక్తికి ట్రంప్ లా కనిపిస్తాడు. ట్రంప్ హావభావాలు ప్రదర్శిస్తూంటాడు. సదరు ఆల్బంలోని ఫొటోల ప్రదర్శన ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం ఇలా హడావిడిచేశారు.